Sunday , September 15 2019
Breaking News
Home / scroll / కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్-గురజాల మాల్యాద్రి

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్-గురజాల మాల్యాద్రి

కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ పనిచేస్తున్నారు
రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన సి.ఎస్
ప్రకృతి వైపరీత్యాలపై సి.ఎస్ తక్షణం స్పందించాలి…గురజాల మాల్యాద్రి

  ఏప్రిల్ 26 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి సుబ్రమణ్యం రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలై ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అధికారాల కట్టడి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి అన్నారు. శుక్రవారం ప్రజావేదిక సమీపంలోని మీడియా పాయింట్ లో తెలుగు యువత నాయకుడు భవనం భూషన్ రెడ్డితో కలిసి మాల్యాద్రి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపధ్యంలో తక్షణం స్పందించి సహయ కార్యక్రమాలు చేయాల్సిన అధికారుల్లో కొందరు అడ్డంకిగా మారారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. తుఫాన్ హెచ్చరికలు వస్తున్న సందర్భంగా సి.ఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఎటువంటి సహాయ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పలు జిల్లాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్య,  పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రుణమాఫీ చెల్లింపులపై చర్యతీసుకోవాల్సిన అధికారులే ప్రజల సమస్యలు తమకు పట్టవన్నట్లు వైదొలిగారని ఆయన తెలిపారు. కరీఫ్ ప్రారంభానికి ముందస్తుగా చేపట్టాల్సిన తక్షణ కార్యక్రమాలు,  పంటల భీమా చెల్లింపులకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు సి.ఎస్ సమాధానం చెప్పాలని సూచించారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అలాంటి అంశాన్ని చర్చించిన దాఖలాలు లేవని అన్నారు. 
నూతన శాసనసభ కొలువుదీరక ముందే రాజధానిలో భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సిన నేపధ్యంలో ఆ అంశంపై దృష్టి సారించలేదని మాల్యాద్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం నిర్మాణ పనులు ఇటీవల మందగించాయని వీటిని వేగవంతం చేయాల్సిన నేపధ్యంలో ఆదిశగా అధికారులు ఆలోచించలేదని చెప్పారు. వారికి అవసరంలేని, అధికారం లేని పనులపై దృష్టి పెట్టి తాను చేయాల్సిన పనులను సి.ఎస్ మరిచారని తెలిపారు. ఎన్నికల కమీషన్ సిఇఒ ఆద్వర్యంలో పని చేయాల్సిన సి.ఎస్ వారిపై ఆదిపత్యం ప్రదర్శిస్తున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన సమీక్ష సమావేశమే నిదర్శనమన్నారు.  పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కి ఇంటిలిజెన్స్ అధికారి రిపోర్ట్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయలేదని, ఐబి చీఫ్ ప్రధానికి రిపోర్ట్ చేస్తుంటే ఇంటిలిజెన్స్ చీఫ్ సి.ఎం కు ఎందుకు రిపోర్ట్ చేయరని మాల్యాద్రి ప్రశ్నించారు. సి.ఎస్ రాజకీయ కార్యకలాపాలు కట్టిపెట్టి తన విధులు నిర్వహించాలని మాల్యాద్రి సూచించారు.
అనంతరం తెలుగు యువత నాయకులు భవనం భూషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు మరచి రాజకీయ కార్యకలాపాలు సాగించడం సి.ఎస్ స్ధాయికి తగదన్నారు. తన పరిధిలో లేని ఎన్నికల సరళిపై సమీక్షించాల్సిన అవసరం సి.ఎస్ కు ఎందుకొచ్చిందని, ప్రజా సమస్యలపై ఎందుకు సమీక్షలు చేయడం లేదో ప్రజలకే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టం,  పిడుగుపాటుకు 7 గురు చనిపోతే సి.ఎస్ ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వేసవి కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని భూషన్ రెడ్డి కోరారు.

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *