Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే – కలెక్టర్

అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే – కలెక్టర్

అసంక్రమణ వ్యాధుల పై సమగ్ర సర్వే – కలెక్టర్

నిజామాబాద్, ఏప్రిల్ 25::-- పెద్ద ఎత్తున విస్తరిస్తున్న అసంక్రమణ వ్యాధులపై సమగ్రంగా సర్వే  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు వైద్యశాఖ సిబ్బందిని ఆదేశించారు.

గురువారం స్థానిక రాజీవ్గాంధీ ఆడిటోరియం లో అసంక్రమణ వ్యాధులకు నిర్వహించే సర్వే పై ఆశా వర్కర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న అవసరాలు, జీవనశైలి, పరిస్థితుల వల్ల అసంక్రమణ వ్యాధులు విస్తరిస్తున్నాయని తెలిపారు. బీపీ, షుగర్, క్యాన్సర్, పెరాలసిస్ తదితర వ్యాధులు గతంలో పట్టణాలకే పరిమితమయ్యేవని ప్రస్తుతం అవి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నాయన్నారు. ఈ వ్యాధులపై సమగ్ర సర్వే నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నందున ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాల్లో 30 సంవత్సరాలు వయసు దాటిన వారి వివరాలతో పాటు వారికి ఏమైనా అసంక్రమణ వ్యాధులు వ్యాప్తి చెంది ఉంటే వాటి వివరాలను పూర్తిగా నమోదు చేయాలన్నారు. అంతేగాక ఆసుపత్రుల్లో ఆ ప్రజలకు అందిస్తున్న చికిత్సలు వైద్య సదుపాయాల గురించి ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆ వివరాలను అందించాలన్నారు. తద్వారా ఆశా వర్కర్లు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులకు వారధిగా పని చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపడినప్పుడే దేశం కాని, రాష్ట్రం కాని, ఆ ప్రజలుకాని ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడటంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లడానికి వీలవుతుందన్నారు . అదేవిధంగా సర్వే సందర్భంగా బయటపడే ముఖ్యమైన, అత్యవసర వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన సత్వర చర్యలపై నివేదికలు కూడా ఇవ్వాలని అన్నారు. ఆయా కేసుల పై ఏ రకమైన చర్యలు తీసుకోవాలో తెలపాలన్నారు. అంతేకాక
మహిళలకు ప్రత్యేకంగా సంక్రమించే వ్యాధుల పై కూడా సరైన వివరాలు సేకరించాలన్నారు. ఈ అన్నింటికీ తదుపరి తీసుకోవలసిన చర్యలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకున్న పలు కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఇందులో ముఖ్యంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు పెరగడం ఒక ఉదాహరణ అని దీనికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సదుపాయాలు, ఇన్సెంటివ్స్, ప్రత్యేక శ్రద్ధ, కెసిఆర్ కిట్టు, ఇతర కారణాలతో ఈ ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి సుదర్శనం ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *