Sunday , September 15 2019
Breaking News
Home / scroll / వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి.

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి.

వేసవి కాలం లో ఆరోగ్యం పై శ్రద్ద ఎక్కువగా ఉండాలి.
కొన్ని చిన్న చిన్న జాగ్రత్తల తో వడ దెబ్బ నుండి రక్షణ పొందవచ్చును
సామాజిక కార్యకర్త   డోన్ పి. మహమ్మద్ రఫి.

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం..శరీరానికి  తగినన్ని నీరు తీసుకోవాలి.
వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని సామాజిక  కార్యకర్త  డోన్ పి. మహమ్మద్ రఫి తెలియజేశారు. 
ప్రస్తుతం ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో ఎండ ప్రభావం వల్ల  శరీరం లోని రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు కొన్ని సర్వే ల ద్వార  తెలియజేస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు. 
కొన్ని లక్షణాలు.
వడదెబ్బకు గురైన వారిలో  శరీరంలో  ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం.వాంతులు, తలతిరగడం, జ్వరం రావడం.. చర్మం ముడతలు  పడటం,  రక్త నాళాల్లో నీటి శాతం తగ్గి పోవడం ,కళ్ళుతిరగడం  తల నొప్పి,  అయోమయ పరిస్థితి  మొదలగు  లక్షణాల తో ఇబ్బంది పడుతుంటే వడ దెబ్బ తగిలిందని గుర్తించాలి. అలాంటి వ్యక్తి ని వెంటనే  నీడకు చేర్చి గాలి వెలుతురు తగిలేలా చూసుకోవాలి. శరీరాన్ని చల్లటి నీటితో తుడవాలి దాహం ఉంటే ఒకేసారి విపరీతంగా తాపడం కంటే కొద్ది కొద్దిగా తాపడం మేలు.ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య నిపుణుల తో చికిత్స చేయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలిపారు.
కొన్ని జాగ్రత్తలు.
వేసవికాలంలో ఎక్కువగా పగటి పూట ఎండ లో  తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో బయటకు వెళ్ళల్సి వస్తే సన్స్క్రీన్, టోపి, సన్ గ్లాసస్, గొడుగులు  టోపీలు, స్కార్ఫ్లు వాడితే మంచిది. ప్రధానంగా ఉదయం 11 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. రోజు కు వారి శరీర అనుకూలాన్ని బట్టి  నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి తెలిపారు 
అలాగే సత్వర శక్తి నిచ్చే నిమ్మ రసం , కొబ్బరి నీళ్ళు ,గ్లూకోజ్ ,పండ్ల రసాలు తీసుకోవాలి.
వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి.  ఇలా చేయడం వల్ల నీరసం రాకుండ ఉంటుందని, అంతేగాకుండా శరీరంలోని నరాలు.. ఎముకలు బలంగా ఉంటాయి.ముఖ్యంగా వేసవి లో చర్మ సంరక్షణ చాలా అవసరం ,అయితే రకరకాల లోషన్స్ కెమికల్స్   కలిగిన లోషన్స్ క్రీములు వాడరాదు.  రెండు పూటల స్నానం చేయ్యాలి.అలాగే చర్మాన్ని రక్షించే విటమిన్ C, E కలిగిన ఆహార పదార్దాలను  ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలను వృద్దులను ఎండ లో తిరగనివ్వకుండా చూసుకోవాలి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం , వాకింగ్ చేయడం ఉత్తమం. ముఖ్యంగా తాజా ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని  సామాజిక కార్యకర్త డోన్ పి మహమ్మద్ రఫి తెలియజేశారు. కావున కొన్ని జాగ్రత్తల తో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *