Sunday , September 15 2019
Breaking News
Home / scroll / జెడ్ పి టి సి ఎంపీటీసీ ల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధం – జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు

జెడ్ పి టి సి ఎంపీటీసీ ల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధం – జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు

నిజామాబాద్ ఏప్రిల్ 22
జిల్లాలో జెడ్ పి టి సి ఎంపీటీసీ ల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు వెల్లడించారు సోమవారం, మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున జిల్లాలో మూడు విడతలుగా డివిజన్ వారిగా జరగనున్నాయని జిల్లాలో 27 జెడ్పిటిసి లకు 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు సమర్ధవంతమైన ఏర్పాట్లకు చేసినట్లు చెప్పారు జిల్లాలో ఏడు లక్షల 79 వేల 164 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు జిల్లాలో మొదటి దశలో నిజాంబాద్ డివిజన్ లో 8 జెడ్పిటిసి లకు 100 ఎంపీటీసీ స్థానాలకు మే ఆరో తేదీన ఎన్నికలు జరుగుతాయని రెండో దశలో బోధన్ డివిజన్లో 8 జడ్పీటీసీలు 75 ఎంపీటీసీ లకు మీ 10వ తేదీన మూడో దశలో ఆర్మూర్ డివిజన్ లో 11 జడ్పీటీసీ లకు 125 ఎంపిటిసి స్థానాలకు మే14న పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు.
నామినేషన్ల వివరాలు
జిల్లాలో జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికలలో నిలబడే వారు సంబంధిత మండల కేంద్రంలోని నామినేషన్ల స్వీకరణకు అన్ని చర్యలు చేపట్టినట్టు చెప్పారు 3 ఎంపీటీసీ నియోజకవర్గాలకు ఒక రిటర్నింగ్ అధికారిని జెడ్ పి టి సి మండలానికి ఒక రిటర్నింగ్ అధికారిని నిర్మించడం జరిగిందని వారందరికీ నామినేషన్ల స్వీకరణ పరిశీలన సంబంధిత విషయాలపై కల్పించి పూర్తిగా అవగాహన కల్పించిన జరిగిందని చెప్పారు మొదటి దశలో జరుగు డివిజన్లో నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని రోజు వారి నామినేషన్ వివరాలను జెడ్పీ సీఈఓ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు
మొదటి దశ నిజాంబాద్ డివిజన్
ఈనెల 22న నామినేషన్ల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ జరిగిందని నామినేషన్లను ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో స్వీకరిస్తారని నామినేషన్ల పరిశీలన ఈనెల 25వ తేదీన ఈనెల 28వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితాను తయారుచేసి గుర్తులను కేటాయించడం జరుగుతుందని ఈ ఎన్నికలు పార్టీ బేసిస్ మీద జరుగుతున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గా గుర్తులు కేటాయింపులు జరుపుతామని మే 6 తేదీన పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు
రెండో దశ బోధన్ డివిజన్
ఈనెల 26వ తేదీన నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ ఈనెల 29వ తేదీన పరిశీలన మే 2 తేదీన ఉపసంహరణ మే 10న పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పారు
మూడవ దశ ఆర్మూర్ డివిజన్
ఈనెల 30వ తేదీన నోటిఫికేషన్ జారీ నామినేషన్ల స్వీకరణ మే 3 తేదీన నామినేషన్ల పరిశీలన మే 6 తేదీన ఉపసంహరణ మే14న పోలింగ్ జరుగుతుందని కలెక్టర్ అన్నారు
డిపాజిట్ వివరాలు
ఎంపీటీసీ జెడ్ పి టి సి ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ వేసే సందర్భంలో డిపాజిట్ చెల్లించ వలసిన అవసరం ఉందని
రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గా జడ్పీటీసీ కి సాధారణ వ్యక్తులు 5000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలని ఎస్సీ ఎస్టీ వ్యక్తులు 2500 చెల్లించాలి ఎంపీటీసీ లకు సాధారణ వ్యక్తులు 2500 రూపాయలు ఎస్సీ ఎస్టీలు 1,250 రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని చెప్పారు పోటీలో ఉన్న అభ్యర్థులు జెడ్పిటిసి లకు నాలుగు లక్షల రూపాయలు ఎన్నికల వ్యయ పరిమితి ఎంపీటీసీ లకు ఒక లక్ష 50 వేల రూపాయల వ్యయ పరిమితి మించకూడదని చెప్పారు
ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ పోలింగ్ రోజున ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు మిగతా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని పోలింగ్ సిబ్బందికి శిక్షణ రెండు రెండుసార్లు నిర్వహించడం జరిగిందని ఎన్నికల నియమావళి అమలుకు నోడల్ అధికారులను కూడా నియమించడం జరిగిందని పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేందుకు వ్యయపరిశీలకులను కూడా నియమించామని చెప్పారు ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించ ఉన్నందున అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని ఎన్నికలలో ఏంలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు
పార్లమెంట్ ఎన్నికల నియమావళి ఇంకా అమలులో ఉన్నందున దానితో పాటుగా జెడ్ పి టి సి ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా అమలులో ఉంటుందని ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలను పాటించాలని కిందిస్థాయి అధికారులు కూడా పాటించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ చెప్పారు
ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వేణు డిప్యూటీ సీఈఓ గోవిందు తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *