Sunday , May 19 2019
Breaking News
Home / scroll / జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి – TWJF

జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి – TWJF

నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లోని జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ లో అర్ధరాత్రి ఆటోలో తరలిస్తున్న ఈవీఎంల విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన జగిత్యాల జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన క్రిమినల్ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) డిమాండ్ చేసింది. విధినిర్వహణలో భాగంగా అక్కడి రిపోర్టర్లు ఈవీఎంల అంశాన్ని కవర్ చేశారు తప్ప వారికి ఎలాంటి దురుద్దేశ్యం లేదని TWJF ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈవీఎంల విషయంలో వార్తలు ప్రసారం చేసిన జగిత్యాల జిల్లా జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సచివాలయంలో  ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(TWJF) స్టేట్ ప్రతినిధి బృందం కలిసింది.  ప్రభుత్వ అధికారుల విధులకు భంగం కలిగించారని, అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీసి ప్రచారం చేసారనే ఆరోపణలతో అర్బన్ తహసీల్దార్   ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ పోలీసు స్టేషన్లో విలేఖరులపై  446, 186, 505/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం సరికాదని దీన్ని TWJF ఖండిస్తోందని వారు తెలిపారు. వెంటనె విలేకరులపై కేసులను  ఉపసంహరించాలని TWJF ప్రెసిడెంట్ ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య తదితరులు డిమాండ్ చేశారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *