Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / 54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

54 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్ నగరంలోని స్థానిక వినాయక్ నగర్లో ఇందూరు అభయాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించడం జరిగిందని అధ్యక్షులు ఆకుల శ్రీశైలం తెలిపారు. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తి అయిందని ఈనెల 18,19,20న స్వామివారి గర్భగుడిలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మరియు 54 అడుగుల విగ్రహం యొక్క షోడష ఉపచార కార్యక్రమాలు చేపడుతామని అధ్యక్షులు శ్రీశైలం గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కల్వకుంట్ల కవిత గారు, విశిష్ట అతిథులుగా MLA లు బిగాల గణేష్ గుప్త గారు, బాజిరెడ్డి గోవర్దన్ గారు, గౌరవ అతిథులుగా మేయర్ ఆకుల సుజాత గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఆత్మీయ అతిథులుగా కార్పొరేటర్ పురుషోత్తం గారు, నాగభూషణం స్వామి గారు హాజరు అవుతారని తెలిపారు. శనివారం 20 తేదీ నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుందని పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని అధ్యక్షులు ఆకుల శ్రీశైలం గారు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ శ్రీ హనుమాన్ దీక్షా పీఠాధిపతులు విజయవాడ గారి నేతృత్వంలో జరుగునని కమిటీ సభ్యులు తెలిపారు. గత సంవత్సరం హనుమద్ జయంతి రోజు భూమి పూజ చేసుకుని సంవత్సర లోపట దాతల నుండి విరాళాలు సేకరించి ఈఈ విగ్రహాన్ని నిర్మించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీశైలం, బాడ్సి శేఖర్ గౌడ్, నరాల సుధాకర్, నాగభూషణం స్వామి, ప్రొద్దుటూరి గంగారెడ్డి, ఎద్దండి మధుసూదన్ రెడ్డి, గుండ సతీష్, కులాచారి సంతోష్, ముత్యాల రవీందర్, తోట గోపాల్, వేములపాటి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *