Sunday , September 15 2019
Breaking News
Home / scroll / మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది –

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగింది –

మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందని బిజెపి విజయ సంకల్ప సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన మాటల్లోనే … టిఅరెస్ ను గత ఎన్నికలలో ప్రజలు గెలిపించారు.. ఈ విషయం లో మాకు బాధ లేదు.మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది చూసి బిజెపి కి ఓటేయండి. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే సత్తా ఉన్న అర్వింద్ ను గెలిపిస్తే మోదీకి బంటుగా ఉండి సేవలందిస్తారు. ఈ విషయాన్ని విదేశాలలో ఉన్న భారతీయులను అడగండి. పని చేసే విధానం లో తేడాను ప్రజలు గమనించాలి. ఐదు సంవత్సరాలలలొ 25 లక్షల ఇండ్లు కాంగ్రెస్ కట్టిస్తే కోటి 30 లక్షల ఇండ్లు మోదీ ప్రభుత్వం కట్టించింది.. 2022 వరకు ఒక్క పేద కూడా సొంత ఇళ్ళు లేకుండా ఉండబోరు. ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ లేకుండా ఉండదు. ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో లాగా గ్యాస్ సిలిండర్లు అందరికీ ఉండేవి. .దేశం లో 7 కోట్లు గ్యాస్ సిలిండర్ లు ఇస్తే రాష్త్రం లో ఇవ్వలేదు. అర్వింద్ ను గెలిపిస్తే గ్యాస్ సిలిండర్ లు వస్తాయి. బిజెపి వచ్చాక నిత్యావసర ధరలు పెరగలేదు. ఆర్థిక వ్యవస్త బలపడింది..రాష్త్రం లో రైతుల పరిస్తితులు బాగాలేవు.అర్వింద్ ను లక్ష్మారెడ్డి ని పార్లమెంటు కు పంపితే పసుపు కొంటాం‌‌.. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం..‌.నాలుగు వేల ఐదువందల మంది రాష్త్రం లో ఐదేళ్ఖలొ ఆత్మహత్య లు చేసుకున్నారు. ఎర్ర జొన్న రైతులకు మద్దతు ధర ఇస్తాం‌.రాష్త్రం లో అవినీతి పాలన నడుస్తుంది..నిజాం షుగర్స్ ను వంద రోజుల్లో తెరిపిస్తామని మాట ఇచ్చి టిఅరెస్ మోసం చేసింది. అర్వింద్ ను గెలిపిస్తే నిజాం షుగర్స్ ను తెరిపిస్తాం. 2022 వరకు రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తాం..అగ్రవర్ణ పేదలకు దేశం లో ఎన్నడూ లేని విదంగా పది శాతం రిజర్వేషన్లు ఇచ్చాం.ముద్ర పథకం ద్వారా పది నుండి 15 కోట్ల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాం..కేంద్ర సర్కార్ ఎంతో చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను ఇక్కడ అమలు చేయడం లేదు.భారత్ కు ప్రపంచం లో బలహీనదేశంగా పేరుండేది..మోదీ పాలనలో ఇప్పుడు బలవంతమైన దేశంగా మారింది..పుల్వామా దాడి తర్వాత మోది నాయకత్వంలో .పాక్ భూభాగంలో కి వెళ్లి ముష్కరుల పని పట్టాం‌..పాక్ లో తీవ్రవాదం ఆగాల్సిందే. ఇందు కోసం భారత్ సహకరిస్తుంది.లేనట్లయితే ఊరుకునేది లేదు. భారత్ తయారు చేసిన యాంటీ సాటిలైట్ మిస్సైల్ అద్భుతం…ప్రపంచంలో ని మూడు దేశాలలో మాత్రమే ఇది ఉంది.శత్రుదేశాల సాటిలైట్ లను అంతం చేసే శక్తి మన మిస్సైల్ కు ఉంది. భారత దేశ ఆర్థిక వ్యవస్త ప్రపంచంనే తొమ్మిది‌నుండి ఆరవ స్థానానికి చేరుకుంది..త్వరలోనే ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ మూడవ స్థానం లోకి చేరుకుంటుంది. టిఅరెస్ కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు..అందుకే బిజెపి అభ్యర్తులను కేంద్రానికి పంపండి. అని సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *