Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి – శ్రీహరి

పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలి – శ్రీహరి

ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ఉద్బోదించారు.జేసిఐ ఇందూర్ ఆద్వర్యంలో బుధవారం నిజామాబాదు నగరంలోని వినాయక్ నగర్ లో ఉన్న నవీపేట సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మైండ్ పవర్ వర్క్ షాప్ నిర్వహించారు..ఈ సందర్భంగా శిక్షకులు శ్రీహరి మాట్లాడుతూ పట్టుదలతో ఉన్నత అవకాశాలను దక్కించుకొని ఉజ్వల భవిష్యత్తు పొందాలని అన్నారు.విద్యార్తులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని సూచించారు.పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు వివరించారు.పరీక్షలంటే ఉన్న భయాన్ని వీడితే విజయం సొంతమవుతుందని చెప్పారు..విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితం లో దేనినైనా సాధించవచ్చన్నారు..ఆత్మవిశ్వాసం దృడసంకల్పం తో ముందుకు సాగితే అనుకున్నది సాదించవచ్చన్నారు.జేసిఐ జోన్ అధికారి చింతల గంగాదాస్, జెసిఐ ఇందూర్ అద్యక్ష కార్యదర్శులు జి.సతీష్, సుంకరి హన్మాండ్లు,మనోజ్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బి.పద్మ, వైస్ ప్రిన్సిపాల్ ఎన్. విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *