Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / ఘనంగా మహిళా దినోత్సవం

ఘనంగా మహిళా దినోత్సవం

జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇందూర్ శాఖ ఆద్వర్యంలో తిరుమల నర్సింగ్ కళాశాల లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులచే రన్ ఫర్ నైన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా జేసిఐ ఆద్వర్యంలో ఆరు వందల మంది విద్యార్తినిలు కళాశాల నుండి నడిపల్లి గ్రామ శివారు వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ రోజు దేశవ్యాప్తంగా గిన్నిస్ బుక్ లో స్థానం కోసం దేశవ్యాప్తంగా 50 వేల పైచిలుకు మంది విద్యార్తినిలు, మహిళలచే 502 నగరాల్లో రన్ ఫర్ నైన్ ర్యాలీలు నిర్వహించడం జరిగిందని జేసిఐ జోన్ అధికారిణి జిలకర లావణ్య ఈ సందర్భంగా చెప్పారు..అనంతరం కళాశాల లో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమం లో విద్యార్థినిలు, అతిథులు మహిళా దినోత్సవం గురించి ప్రసంగించారు.. కళాశాల ప్రిన్సిపాల్ కె.సి.అనిత మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని గుర్తు చేశారు..సమాజం లో ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాదించే దిశలో ముందుకు సాగాలని సూచించారు..గిన్నిస్ బుక్ రికార్డు సాధనలో భాగంగా జరిగిన రన్ ఫర్ నైన్ కార్యక్రమం లో పాల్గొన్న విద్యార్థినిలకు ఈ సందర్భంగా సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. కార్యక్రమం లో జెసిఐ ఇందూర్ అధ్యక్షుడు జి.సతీష్, పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు కోడూరు పద్మ,కార్యదర్షి టి.ప్రసన్న, ఉపాద్యక్షులు డాక్టర్ రాజశేఖర్, తిరునగరి శ్రీహరి, కోడూరు స్వామి, ఎల్.లావణ్య తదితరులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *