Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / ప్రతీ ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి

ప్రతీ ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి

ప్రతీ ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని నిజామాబాదు రెడ్ క్రాస్ సొసైటి చైర్మెన్ డాక్టర్ నీలి రాంచందర్ ఉద్బోదించారు. నిజామాబాదు నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఉన్న గాంధీ యువజన సంఘం ఆద్వర్యంలో ఇద్దరు పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషిన్లను అందజేశారు.శనివారం సంఘ భవనం లో జరిగిన కుట్టు మిషిన్ల పంపిణీ కార్తక్రమానికి డాక్టర్ రాంచందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు..మహిళలు స్వయం ఉపాధి పొందేందు కోసం గాంధీ యువజన సంఘం ముందుకు వచ్చి ఉచితంగా కుట్టు మిషిన్లు అందించడం అభినందనీయమని అన్నారు.. నెహ్రూ యువ కేంద్రం ఆద్వర్యంలో అందించిన జ్యూట్ బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం లో శిక్షణ పొందిన మహిళలకు ఈ సందర్భంగా సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జేసిఐ ఇందూర్ జోన్ అధికారి చింతల గంగాదాస్, నెహ్రూ యువ కేంద్రం ప్రాజెక్టు అధికారి జి.తులసీధర్, గాంధీ యువజన సంఘం అధ్యక్షుడు ఎం.పోచయ్య,కస్తూరి మహిళా సంఘం ప్రతినిధులు సిహెచ్ పద్మ, బి.అరుణ,కె.సంగీత తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *