Sunday , September 15 2019
Breaking News
Home / scroll / శ్రీమతి గుజ్జ రాజేశ్వరిని ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం

శ్రీమతి గుజ్జ రాజేశ్వరిని ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం

నిజామాబాద్‌ మార్చి 7 ః పద్మరత్న పురస్కారాన్ని పొందిన తెలంగాణ పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలు, గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరిని ఘనంగా సన్మానించారు. జిల్లా పద్మశాలి సంఘ భవనంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పద్మశాలి ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ అసోసియేషన్(పోపా) ఆద్వర్యంలో రాజేశ్వరికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పోపా అధ్యక్షుడు గుడ్ల భూమేశ్వర్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా రాజేశ్వరి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్త్ర స్థాయి పద్మరత్న పురస్కారం అందజేసిందని గుర్తు చేశారు. నిస్వార్దంగా సేవలందిస్తున్న గుజ్జ రాజేశ్వరి మరెన్నో సన్మానాలు అందుకోవాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత గుజ్జ రాజేశ్వరి మాట్లాడుతూ పద్మరత్న పురస్కారం తన బాద్యతను మరింత పెంచిందని అన్నారు.సేవా కార్యక్రమాలు మరింత విసృత పరుస్తానన్నారు..కార్యక్రమం లో ‌పోపా కార్యదర్శులు చింతల గంగాదాస్, జక్కుల గంగాదాస్,ఉపాద్యక్షులు నాందేవ్,పద్మశాలి ఆత్మీయ సేవా సమితి ప్రధాన కార్యదర్శి చెన్న రాజేంద్రసాగర్,పద్మశాలి మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్షులు గుండ సరోజ,గుడ్ల చంద్రబాగ తదితరులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ

ఆవు పేడతో వినాయక విగ్రహాల తయారీ గోమాత అంటే హిందువులందరికి ఆరాద్య వైవం.. గోవుతో అనేక లాభాలు వున్నాయి. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *