Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకున్నారు. మొదటి రోజు నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో బుధవారం నిర్వహించిన ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల ఆధ్వర్యంలో పేరిణి నృత్యం, చిందు కళాకారులతో వివిధ నాటికల ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటీష్ హై కమిషన్ బృందం సభ్యులు ఆండ్రూ ఫ్లేమింగ్, రాజకీయ మీడియా విభాగాధిపతి కైరన్ డ్రాకె, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ హాజరై వీక్షించారు. సంగీత పాఠశాలల ఆధ్వర్యంలో చేసిన పేరిణి నృత్యం ఆకట్టుకుంది. శివుడి వేషధారణలో శివతాండవం చేశారు. నృత్యాలను బృందం సభ్యులు ఆసక్తిగా వీక్షించి, వివిధ వేషధారణలను తమ కెమెరాల్లో బంధించారు. కళాకారులతో ఫొటోలు దిగారు. శ్రీరాముని జీవిత చరిత్రపై చిందు కళాకారులు చేసిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. బృందం సభ్యులు కళాకారులను అభినందించారు.  అనంతరం రాజీవ్‌గాంధీ ఆడిటోరియం లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటీష్ హై కమిషన్ బృందం సభ్యులు ఆండ్రూ ఫ్లేమింగ్, రాజకీయ మీడియా విభాగాధిపతి కైరన్ డ్రాకె, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సిస్టర్స్ ఫర్ చేంజ్ ర్యాలీని బృందం సభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సిస్టర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా గిఫ్ట్ ఎ హెల్మెట్ కార్యక్రమానికి బృందం సభ్యులు మద్దతు తెలిపారు. రెండవ రోజు బాసరలోని సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని  సీతారం నగర్ కాలోనిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గోన్న బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం పథకం అమలు గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన రైతులు, మహిళా డ్వాక్రా సంఘాల ప్రతినిధులో ముఖాముఖి సామావేశంలో పాల్గొన్నారు. అనంతరం మాట్టాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం ఎంతో భాగుందతని కంటి సమష్యలతో భాదపడేవారిఇక ఎంతో ఉపయోగకరంగా వుందని అన్నారు. జిల్లాలో రైతులు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని కోనియాడారు.

 

మహిళా ప్రజా ప్రతినిధులు, మైనార్టీలు, రైతు ప్రతినిధులు తో బ్రిటీష్ దౌత్యవేత్తలు సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వారి అభిప్రాయాలను తెలిపారు.

సూదం లక్ష్మి, శ్రీవాణి
కార్పొరేటర్లు

సీఎం కేసీఆర్, ఎంపి కల్వకుంట్ల కవిత వల్ల నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతోంది.
కల్యాణలక్ష్మి,కేజి టు పీజీ, కేసీఆర్ కిట్ పథకాలు సూపర్ హిట్. ఎంపి కవిత సొంత ఖర్చుతో ఆసుపత్రుల్లో భోజనం పెడ్తున్నారు.
బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారు.
మహిళలు కోసం కంపెనీలు స్టాపించండి..

మోహన్ రెడ్డి, ఆర్మూర్ మండల
రైతు సమన్వయ సమితి అధ్యక్షులు

సీఎం కు కృతజ్ఞతలు
రుణమాఫీ చేశారు.
24గంటల పాటు కరెంట్ ఇస్తున్నారు.
వర్షాలు పడుతున్నాయి.
కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నారు. దేవుడిలా పూజిస్తున్నాం.
రైతు భీమా కల్పించి రైతు కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎర్ర జొన్న బకాయిలు రూ 11 కోట్లు చెల్లించారు. ఎర్ర జొన్నలు మద్దతు ధర కల్పించారు.

కాశం సాయిలు, రెంజల్ మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

ఉద్యమ నేత కేసీఆర్ రైతు పక్షపాతి. ఎన్నో ప్రభుత్వాలు చూశాం..కానీ కేసీఆర్ లాంటి సీఎం ను చూడలేదు. కేసీఆర్ ఆయత చండీ యాగం ఫలితంగా వర్షాలు పడుతున్నాయి.

వకీల్ గంగారెడ్డి,
జక్రాన్ పల్లి,
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు

విడిపోయాక రైతుల అభివృద్ధి
గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నీళ్లను మళ్లిస్తున్నారు. ప్రపంచంలోనే ఇది పెద్ద కార్యక్రమం.
ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పథకాన్ని కొనసాగించాల్సి న పరిస్తితి ఉంది.
రైతు ఎలా చనిపోయినా బీమా ఇస్తున్నారు. హెల్త్ కార్డులు ఇస్తే చాలా మేలు జరుగుతుంది.

నారాయణ రెడ్డి,
డిచ్ పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు

ఎంపి కల్వకుంట్ల కవిత మన ప్రగతిని చూసేందుకు బ్రిటీష్ దౌత్యవేత్తల ను జిల్లాకు పంపడం మాకు సంతోషంగా ఉంది అంటూ.. సిరులున్న యమ్మా…అంటూ పాట పాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. కేసీఆర్ మళ్లీ, మళ్లీ సీఎం కావాలి

హఫీజ్ లయీక్
జమాతే ఇస్లామీ

హిందూ, ముస్లిం భాయి భాయి..గంగా జమున తైజీబ్ సంస్కృతి మాది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది..ఇలాంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనూ లేదు.
ఖిలా లో యునాని ఆసుపత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఉర్దూ మీడియం బాలికల కాలేజ్ అవసరం ఉంది.

నవీద్ ఇక్బాల్,
జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు

12 శాతం రిజర్వేషన్లు కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన చిత్త శుద్దిని నిరూపించుకున్నారు.
ఒక మైనార్టీ విద్యార్థికి ప్రభుత్వం ఏడాదికి రూ.1లక్ష ఖర్చు చేస్తున్నది. మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు అందరికీ ఇస్తున్నారు.

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ మహిళలు, రైతులు, మైనార్టీలు సంతోషంగా ఉన్నట్లు సమావేశంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి అని అన్నారు. నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పట్ల మీకు ఉన్న ప్రేమాభిమానాలు మాకు తెలిశాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం పట్ల మీకు విశ్వాసం ఉంది అన్నారు.జిల్లా అభివృద్ధి లో పురోగమిస్తోంది అని ఆండ్రూ తెలిపారు.

సమావేశంలో బ్రిటీష్ హై కమిషన్ మిస్టర్ కౌన్సిల్ రాజకీయ, మీడియా విభాగం అధిపతి కీరన్ డ్రేక్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్,నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత, రెడ్ కో చైర్మన్ ఎస్. ఎ ఆలీం పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *