Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపి కవిత

నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః నిజామాబాద్ కేంధ్రంలోని నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ లో సౌకర్యాలను విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. కేచెన్, డార్మేటరీ, బాత్ రూం లను పరిశీలించారు. పరిశుభ్రతకు ప్రా ధాన్యమివ్వాలని, దుస్తులను రోజూ ఉతికించాలని సిబ్బందికి సూచించారు.
కిచెన్ ను నీట్ గా ఉంచాలన్నారు. వంట నూనె,బియ్యం,పప్పు ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. స్టడీ రూం లలో తగిన వెలుతురు ఉండేలా చూడాలని, పరీక్షల సమయం కాబట్టి వేళకు భోజనం, నిద్ర, స్టడీ అవర్స్ నిర్దేశిత టైం ప్రకారం జరిగేలా చూడాలని ఇంచార్జి ప్రిన్సిపాల్ మూస్తాఫా, సిబ్బందికి సూచించారు. విద్యార్థులు, స్టాఫ్ హాజరును పరిశీలించారు.
ఎంపి కవిత వెంట నగర మేయర్ ఆకుల సుజాత, రెడ్ కో చైర్మన్ అలిం, కలెక్టర్ ఎం.ఆర్ ఎం రావు, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఉన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *