Wednesday , June 19 2019
Breaking News
Home / జిల్లా ముఖ్యాంశాలు / రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయం – రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్ ః ప్రజా జాగృతి ః రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ ధ్యేయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కేట్ కమిటీలో మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎర్రజోన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండ ఉండాలని రాష్ర్ట ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రజోన్నలకు 2300 మద్దతుధర ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల శ్రేయస్సును ధృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముగ్గురు ఎమ్మెల్యేలం కెసిఆర్ ధృష్టికి తీసుకువెళ్లామని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, మార్కేట్ కమిటీ చైర్ పర్సన్ కులాచారి దివ్వదినేష్ కుమార్, డైరెక్టర్లు శ్రీధర్, బిల్లా మహేష్, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరి స్వరూపరాణి, నాయకులు దినేష్ కుమార్, ముత్యంరెడ్డి, శ్రీనివాస్ రావు, కాలూర్ సంతోష్, రూరల్ ఎడిఎ వెంకలక్ష్మీ, అసిస్టెంట్ సెక్రటరిలు విజయ్ కిషోర్, రవీంధర్ రెడ్డి, మర్చంట్ ఆసోసియేషన్ నాయకులు గంప శ్రీనివాస్, శంకర్, మల్లేష్ తదితరులు పాల్గోన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *