Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ

బాజిరెడ్డి చేతుల మీదుగా వడ్డెర  ఐక్య వేధిక ( వడ్డెర జెఏసి) క్యాలెండర్ ఆవిష్కరణ

నిజామాబాద్ ః  ప్రజా జాగృతి ః  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేతుల మీదుగా శనివారం వడ్డేర ఐక్య వేధిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వడ్డెర జెఏసి రాష్ర్ట కన్వినర్ దండి వెంకట్, జిల్లా అధ్యక్షులు ఓల్లేపు శంకర్ మాట్లాడుతూ వడ్డెరల అభివృద్దికి ప్రభుత్వం కృషి చేసేలా చూడాలని ఎమ్మేల్యేను కోరారు. అలాగే ప్రభుత్వ పథకాలలో, ఇతర కేటాయింపుల్లో  మా వాటా మాకు వచ్చేలా చూడాలన్నారు. ఆనంతరం రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డేరలు ఐక్యంగా ఉండి అభివృద్ది దిశలో పయనించాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం వడ్డేర సోసైటీలకు రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందని, వాటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. వడ్డేరలు చైతన్యవంతమై ఒక్కటిగా ముందుకెళ్లడం చాలా ఆనంధంగా ఉందని ఆయన అన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎఎంసి చైర్ పర్సన్ దివ్వదినేష్ కుమార్,  స్పోర్ట్స్ ఆథారిటి చైర్మన్ గడీల శ్రీరాములు, వడ్డేర ఐక్య వేధిక రాష్ర్ట, జిల్లా నాయకులు ఎత్తరి రాములు, వేముల రవి, ర్యాపని నర్సింలు, చిన్న రాజు, బోదాసు శంకర్, కొమిరే రాజు, బోదాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *