Wednesday , June 19 2019
Breaking News
Home / scroll / హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

కేంద్ర మంత్రి  హన్స్ రాజ్ గంగారాం  హైదరాబాద్ వచ్చిన సందర్బంగా రాష్ట్రా కార్య వర్గ సభ్యులు ధర్మపురి అరవింద్   కలిసి రైతుల పక్షాన వినతి పత్రం సమర్పిపించి ఈ విదంగా కోరడం జరిగింది.

ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన MSP పథకం వలన రైతులు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు కనీస మద్దతు ధర ను పొందే అద్భుతమైన అవకాశం లభించింది. ఈ పథకం లో భాగం గా మన నిజామాబాదు సెగ్మెంట్ లో విరివిగా పండే ఎర్ర జొన్న, పసుపు పంటలను కూడా MSP జాబితా లో చేర్చి, ఇక్కడి రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించగలరని   హన్స్ రాజ్ గంగారామ్ ఆహిర్  కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హన్స్ రాజ్ గంగారామ్   మన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మాత్రమే కాకుండా యూనియన్ మినిస్టర్ అఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ మరియు NDRF కి సంబంధిత మంత్రి గా పలు పోర్ట్ పోలియో లను నిర్వహిస్తున్నారు. మొన్న వచ్చిన అకాల వర్షం కారణం గా నష్టపోయిన పంటలకు తగిన నష్ట పరిహారం ఇప్పించాలని కూడా   కోరడం జరిగింది. దినికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఆ రోజు రాత్రి కురిసిన వర్షాలకు మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు.

About Srinivas Kuncham

Check Also

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం, వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ – లంకా దినకర్

వివి ప్యాట్ లు చంద్రబాబు విజయం వీడ్కోలు వేడుకగా మోదీ నామినేషన్ బిజెపి ఎంపిల సహకారంతో చంద్రబాబు సారద్యంలో జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *