Wednesday , June 19 2019
Breaking News
Home / జాతీయం /  24న రధసప్తమి మహా పర్వం

 24న రధసప్తమి మహా పర్వం

24న రధసప్తమి మహా పర్వం

తంసూర్యం ప్రణమామ్యహం

ప్రాగ్‌దిశలో నిత్యం దర్శనమిచ్చే ప్రత్యక్ష నారాయణుడు.. సూర్యభగవానుడు. ఆరోగ్య ప్రదాత, ఆత్మకారకుడు అయిన ఆదిత్యుడి ఆరాధన సర్వదా శుభప్రదం. వైదికంగా సూర్యోపాసన ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. వైద్యశాస్త్ర పరంగానూ సూర్యునికి విశిష్టమైన స్థానం ఉంది.

తిథులలో సప్తమికి సూర్యుడు అధిపతి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించినందున దీనికి సూర్య సప్తమి అని పేరు వచ్చింది. అయితే సూర్య జయంతి రథసప్తమిగా ప్రాచుర్యం పొందడం వెనుక ఒక కారణం ఉంది. నిరంతరం సంచరించే సూర్యభగవానుడి రథం ప్రత్యేకమైనది. దీనికి ఒకే చక్రం ఉంటుంది. నిర్ణీత వేగంతో క్రమం తప్పకుండా ఇది తిరుగుతూ కాలాన్ని నడిపిస్తుంటుంది. ప్రత్యేక రథంపై కదిలి వచ్చే స్వామి కనుక సూర్యసప్తమి కాస్తా రథసప్తమిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకే రథ సప్తమి రోజున వాకిలిలో రథం ముగ్గు వేయడం చూస్తుంటాం.

ఉత్తరాయణ పుణ్యకాలం మొదలు ఆదిత్యుని ప్రభావం మొదలవుతుంది. అందునా.. రథసప్తమి నుంచి భానుకిరణాలు భూమండలంపై పరిపూర్ణంగా ప్రసరించడం మొదలవుతుంది. నిత్యం తూర్పున ఉదయించే సూర్యుని గురించి వేదాల్లోనూ ప్రస్తావన ఉంది. నాలుగు వేదాలలో మొదటిదైన రుగ్వేదంలో సూర్యుని ప్రస్తావన ఉంది. ఆదిత్యుడిని వర్ణించే మంత్రాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. వాటిని సౌర సూక్తాలు అని పిలుస్తారు. విష్ణువులోని క్రియాశీలక శక్తినే సూర్యుడు అని తెలిపింది రుగ్వేదం. అగ్నిగోళం రూపంగా ఉండే ఈ శక్తి నిరంతరం వెలుగులు ప్రసరింపజేస్తూ.. పరిభ్రమిస్తూనే ఉంటుంది.

మహాభారతం ప్రకారం బ్రహ్మ కుమారుడైన కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురైన అదితి వల్ల ధాత, అర్యముడు, మిత్ర, ఇంద్ర, వరుణ, అంశ, భగ, వివస్వత, పూష, సవిత, త్వష్ట, విష్ణు పేర్లతో పన్నెండు మంది ఆదిత్యులు జన్మించారు. వీరినే ద్వాదశాదిత్యులని పిలుస్తారు. సూర్యభగవానుడు తన శక్తిని పన్నెండు నెలల్లో పన్నెండు రకాలుగా లోకానికి అందించడాన్ని ఈ ద్వాదశాదిత్య రూపాలుగా భావిస్తారు. ఆదిత్యుడు తన స్వనక్షత్రమైన కృత్తికా నక్షత్రమందు ప్రభవించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది.

భానూదయానికి వేదిక తూర్పు దిశ. అందుకే ఈ దిక్కును సూర్యుని నిలయంగా చెబుతారు. అందుకే ప్రత్యక్ష నారాయణుడు ఉన్న దిశకు అంత్యంత ప్రాధాన్యం నెలకొంది. మానవుడని బుద్ధి వికాసానికి ప్రాగ్‌దిశ ద్వారం వంటిది. అందుకే అన్ని రకాలైన దైవీ కార్యక్రమాలూ తూర్పుకు అభిముఖంగా ఉండి చేస్తుంటాం. సూర్యోదయం మొదలు అస్తమయం వరకు సూర్యుడిని మూడు కాలాలలో మూడు స్వరూపాలతో త్రిగుణాత్మకుడిగా వర్ణించారు ప్రాజ్ఞులు. ఉదయం బ్రహ్మ స్వరూపంగా, మధ్యాహ్నం రుద్ర రూపంగా, సాయంత్రం విష్ణు స్వరూపంగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. అందుకే త్రికాలాలలో సంధ్యావందనం ద్వారా సూర్యోపాసన చేయడం
జరుగుతోంది.

 

రథసప్తమీ వ్రతం

ఆదిత్యుడి అనుగ్రహం కోరుతూ రథ సప్తమి నాడు ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. సప్తమికి ముందు రోజైన షష్టి నాడు మొత్తం ఉపవాసం ఉంటారు. సప్తమి రోజు సూర్యోదయానికి ముందు తెల్ల నువ్వులు కలిపిన జలంతో తలస్నానం ఆచరిస్తారు. బియ్యం పిండితో సూర్యభగవానుడి యంత్రాన్ని వేస్తారు. దానికి షోడషోపచార పూజలు నిర్వహించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పాయసాన్ని చిక్కుడాకుల్లో నివేదిస్తారు. చిక్కుడు కాయలు, ఆకులు జీర్ణక్రియను విశేషంగా ప్రభావితం చేస్తాయి. అందుకే నివేదనలో వీటికి ప్రాధాన్యం ఏర్పడింది.

పవిత్ర పర్వదినం
కురువృద్ధుడు, సదాచార సంపన్నుడు అయిన భీష్ముడు బ్రహ్మైక్యం పొందిన మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమిగా ప్రాచుర్యం పొందింది. భీష్ముడు అష్టవసువుల్లో ఒకడు. మిగిలిన ఏడుగురి వసువుల శక్తిని తనలో కలిగి ఉన్నవాడు. కురుక్షేత్రంలో అర్జునుడి శరపరంపర శరీరాన్ని చిధ్రం చేసినా.. ఇచ్ఛామరణ వరమున్న భీష్ముడు కన్నుమూయలేదు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు శరతల్పగతుడై బతికున్నాడు. ఈ సమయంలోనే ధర్మరాజుకు రాజ ధర్మాలతో పాటు విష్ణుసహస్రనామాలను ఉపదేశించాడు భీష్ముడు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత అష్టమి

అనుగ్రహ రాజు
సౌరకుటుంబ విధానం అంతటికీ రవి మూలాధార గ్రహం. ఇతనికి నక్షత్ర జనకుడు అని కూడా పేరు. గ్రహాధిపతిగా కూడా కొలుస్తారు. పాశ్చాత్యులు రవిని అపోలో అని పిలుస్తారు. సింహరాశికి అధిపతి. మేషం రవికి ఉచ్ఛస్థానం. తుల నీచ స్థానం. పాలక గ్రహమిది. రవి చేతనత్వానికి ప్రతీకగా, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేవాడిగా చెబుతారు. ఆత్మ కారకుడు. పితృభావాన్ని బలపరుస్తాడు. దృఢచిత్తం, నిష్కర్షత్వం కలగజేస్తాడు. ఈయన నేత్ర కారకుడు. అంతేకాదు.. ఆరోగ్య ప్రదాత. గ్రహదోష నివారణకు, ఆరోగ్యసిద్ధికి ఆదిత్యహృదయం, అరుణ పారాయణం, సూర్య నమస్కారాలు చేయడం

About Srinivas Kuncham

Check Also

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..!

వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో ఇలా తెలుసుకోండి..! వాట్సప్‌ యాప్‌ లేని ఆండ్రాయిడ్‌ యూజర్‌లు దాదాపు ఉండరు. ఇది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *