Sunday , December 16 2018
Breaking News
Home / scroll /  గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి….

 గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి….

గుర్తింపు లేని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి….

నిజామాబాద్ డిసెంబర్ 13  :-
ప్రభుత్వ పూర్తి నియమనిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు పొందని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలనతెలంగాణి బి.సి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ప్రతాప్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అని అన్నారు. కనీస మౌలిక వసతులు,అర్హత లేని ఉపాధ్యాయులు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాటిని నడిపిస్తున్న పట్టించుకునే నాధులే కరువయారన్నారు. దీని వలన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. అంతేకాకుండా ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తూ ధనార్జనే ధ్యేయంగా చేసుకుని కొని పాఠశాలలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి జిల్లాలో అనుమతులు లేని పాఠశాలలను బహిర్గతం చేయాలని అన్నారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకట్, సహాయ కార్యదర్శి నరేష్, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *