Thursday , March 21 2019
Home / scroll / పహాణీల తయారీ వేగవంతం చేయండి

పహాణీల తయారీ వేగవంతం చేయండి

పహాణీల తయారీ వేగవంతం చేయండి
వీసీలో ఆదేశించిన ఇన్‌ఛార్జి కలెక్టర్‌

నిజామాబాద్‌ : భూ రికార్డుల శుద్ధీకరణలో ఇప్పటివరకు సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీని వేగవంతం చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పలు పథకాలపై తహసీల్దార్లతో మాట్లాడారు. అధిక గ్రామాల్లో సర్వే పూర్తయినా కూడా మ్యాన్‌వల్‌ 1బి, పహాణీల తయారీలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇక నుంచి వాటిపై దృష్టి సారించాలని చెప్పారు. భూ రికార్డుల శుద్ధీకరణలో భాగంగా కొందరూ వీఆర్వోలు డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఎవరైన డబ్బులు తీసుకొని సర్వే చేస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. తహసీల్దార్లు సర్వేను పర్యవేక్షించాలని చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు సర్వే ప్రక్రియ పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. గ్రామాల వారీగా సర్వే చెక్‌లిస్టులో మన జిల్లా 8వ స్థానంలో ఉందన్నారు. ఇప్పటివరకు 7,81,882 సర్వే నంబర్లకు గాను 6,51,004 సర్వే నంబర్లను పరిశీలించినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని చెప్పారు. వీసీలో నిజామాబాద్‌ ఆర్డీవో వినోద్‌కుమార్‌, తదితరులు ఉన్నారు.

About Srinivas Kuncham

Check Also

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*

*నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*చౌటుప్పల్ మార్చ్ 15 :  యాదాద్రి జిల్లా              …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *