Friday , January 19 2018
Breaking News
Home / scroll / గంగూలీ రికార్డుకు ధోనీ ఎసరు!

గంగూలీ రికార్డుకు ధోనీ ఎసరు!

గంగూలీ రికార్డుకు ధోనీ ఎసరు!

హైదరాబాద్‌: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ మరో మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ రికార్డును సమం చేయనున్నాడు. శ్రీలంకతో మొహాలిలో బుధవారం జరిగే రెండో వన్డేలో ఈ ఘనత సాధించనున్నాడు.ధర్మశాల వన్డే మహీ కెరీర్‌లో 310వ వన్డే. మొహాలిలో ఆడబోయేది 311. మాజీ సారథి గంగూలీ తన కెరీర్‌లో 311 వన్డేలు ఆడాడు. ఇప్పుడా రికార్డును ధోనీ సమం చేయనున్నాడు. ఆ తర్వాత విశాఖలో జరగబోయే మ్యాచ్‌తో దీన్ని బద్దలు కొట్టేస్తాడు. మహ్మద్‌ అజహరుద్దీన్‌ (334), రాహుల్‌ ద్రవిడ్‌ (344), సచిన్‌ తెందుల్కర్‌ (463) అతనికన్నా ముందున్నారు.

వయసు పెరుగుతున్నా తనలో క్రికెట్‌ ఆడే సత్తా తగ్గలేదని ధోనీ నిరూపిస్తూనే ఉన్నాడు! అందుకు ధర్మశాల మ్యాచ్‌ ఒక ఉదాహరణ. పేస్‌ పిచ్‌పై 29 పరుగులకే 7 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియా పరువు నిలిపాడు. 50 పరుగులకే ఆలౌట్‌ కాకుండా తన విలువైన అర్ధశతకంతో 112 పరుగులకు చేర్చాడు. 10 బౌండరీలు 2 సిక్సర్ల సాయంతో 87 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ధోనీ 310 వన్డేల్లో 51.8 సగటుతో 9,891 పరుగులు చేశాడు. 10 శతకాలు, 67 అర్ధశతకాలు బాదాడు.

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *