నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన
1000 మెగా వాట్ల రైల్వే సోలార్ మిషన్ లో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను ఎంపిక చేయాలని
గత ఏడాది మార్చి 14 వ తేదీన అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు కు లేఖ రాసిన విషయం తెలిసిందే.ఆగస్టు 1 న మరోసారి లేఖ రాశారు. స్పందించిన రైల్వే మంత్రి సోలార్ ప్లాంట్ ను మంజూరు చేశారు. త్వరలో
నిజామాబాదు రైల్వే స్టేషనులో 85 kwp సోలార్ ప్లాంట్ పనులు మొదలవుతాయి. ఈ పనులకు సంబందించిన టెండర్ల ప్రక్రియ ను దక్షిణ మధ్య రైల్వే కు అప్పగించారు.
సోలార్ పవర్ ఏర్పాటు వల్ల రైల్వే స్టేషన్లలో రైళ్ల రాకపోకలు తెలిపే బోర్డు లు, లైట్లు మరింత ప్రకాశవంతగా కనిపించనున్నాయి. స్టేషన్లో పవర్ కట్ అయితే జనరేటర్లను వాడుతున్న నేపథ్యంలో సోలార్ పవర్ వల్ల వ్యయం తగ్గనుంది. సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు చేసిన మంత్రి పీయూష్ గోయాల్ కు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా కృత్ఞతలు తెలిపారు.
