Saturday , November 17 2018
Breaking News
Home / scroll / వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

వరంగల్ అర్బన్ జిల్లా ఎ.జి.ఎం దవాఖానలో పలు అభివృద్ధి కార్యక్రమాలు డయాలసిస్ కేంద్రం, మెకానైజ్డ్ లాండ్రీని, సీనియ‌ర్ రెసిడెంట్స్ హాస్ట‌ల్‌, 30 ప‌డ‌క‌ల స‌ర్జిక‌ల్ వార్డుని, రేడియాలజీ విభాగాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి.

హాస్పిటల్లోని వసతులు, స‌ర్జిక‌ల్ వార్డులోని స‌దుపాయాల‌ను, డయాలసిస్ కేంద్రంలోని ఫిల్టర్లను ప‌రిశీలించిన ఉప ముఖ్యమంత్రి కడియం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ
రోగులకు మరింత మంచి వైద్య సదుపాయాలు కల్పించే వాటిని నేడు ప్రారంభించాం. రోజు 56 మందికి డయాలసిస్ చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొన్నాం. భూపాలపల్లి ఏటూరునాగారం లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కు మంత్రి లక్ష్మారెడ్డి సహకారించాలి. పి.ఎం.ఎస్.ఎస్.వై కింద కె.ఎం.సి ఆవరణలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభం అయితే ఎం జి.ఎం పై భారం తగ్గుతుంది. మెరుగైన వైద్యం, మెరుగైన పరిశుభ్రత ప్రభుత్వ హాస్పిటల్స్ లలో కల్పిస్తున్నాం. గతంలో లేని విధంగా ప్రభుత్వ దవాఖానాలు పటిష్టం అవుతున్నాయి.

అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళండంలో భాగంగా విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మెడికల్ కాలేజి వరకు ఏమేమి ఉండాలో వాటన్నిటినీ సమకూర్చి రూపురేఖలు మార్చుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని స్పెషాలిటీ ట్రీట్ మెంట్స్ అందిస్తున్నాం. ప్రభుత్వ దవాఖానాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి మంచి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాన్నాం.
కేసీఆర్ కిట్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. 240 వాహనాలు గర్భిణీ మహిళల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రారంభించి నడిపిస్తున్నాం. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి బయటకు వచ్చే వరకు అన్ని రకాల వసతులు అందిస్తున్నాం. అదే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు10 వేల పోస్టులు భర్తీ చేస్తూ స్టాఫ్ కొరత లేకుండా చేస్తున్నాం. ఫార్మ్ బి వారికి న్యాయం చేయడానికి కమిటీ వేశాం అన్నారు.

ఈ కార్య‌క్ర‌మాల్లో జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ గ‌ద్ద‌ల‌ ప‌ద్మ‌, మేయర్ నన్నపనేని నరేందర్,
ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌ ఎమ్మెల్యే దాస్యం విన‌య భాస్క‌ర్‌, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, స్థానిక కార్పొరేట‌ర్‌, డి.ఎం.ఎచ్. ఓ హరీష్ రాజ్, హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ దొడ్డ ర‌మేశ్‌, ఇత‌ర‌ ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *