Saturday , April 21 2018
Breaking News
Home / scroll / బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ ,R&B శాఖ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు,హైదరాబాద్ నుండి వచ్చిన ఆర్కిటెక్టర్లతో మరియు కాంట్రాక్టర్లతో నగరమంతా పర్యటించారు. నగరం లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులను, మిషన్ భగీరత,అమృత్ ,రోడ్ల పునరుద్ధరణ పనులను,సెంటర్ మీడియన్ మరియు బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్లకు పనులు చేయడం లో ఏమైనా ఇబ్బందులు ఉన్న వెంటనే తనకు ఫోన్ చేయమన్నారు సహాయం చేస్తామన్నారు.పనులు నాణ్యత గా చేయాలని ఎక్కడ ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అధికారులు ఇంత అర్థ రాత్రి వరకు కూడా పనులను ప్రయవేక్షించడం అభినందనీయం అన్నారు.

వెంట మున్సిపల్ శాఖ కమీషనర్ జాన్ సాంసన్ గారు, De రషీద్ గారు,R&B శాఖ ఈఈ హన్మంత్ రావ్ గారు ,డిఈ రాజేందర్ గారు,పబ్లిక్ హెల్త్ శాఖ డీఈ తిరుపతిగారు తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన వి.జి.గౌడ్

కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్సీ వి.జి.గౌడ్  ప్రారంభించారు. డిచ్ పల్లి మండలంలోని కొత్తపేట్ గ్రామంలో ఎ మ్మేల్సీ, సిడిపి నిధుల  నుండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *