Sunday , May 27 2018
Breaking News
Home / scroll / మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల మౌళిక వ‌స‌తులకు నిధులు కేటాయించాల‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని కోరిన రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల అమ‌లులో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ కితాబు

మంగ‌ళ‌వారం ఢిల్లీలోని పండిత్ అంత్యోధ‌య భ‌వ‌న్ (సి.జీ.ఒ కాంప్లెక్స్) లో కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తో రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు.

ఈ స‌మావేశంలో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠ‌శాల అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి కోరారు.

కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీతో స‌మావేశం అనంత‌రం, ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ లోని శ‌బ‌రీ బ్లాక్ లో రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి మీట్ ది ప్రెస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ…  నిజామాబాద్ – కామారెడ్డి జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టిన మైనారిటి గురుకుల పాఠశాలలకు మౌళిక వసతులు, ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరామ‌ని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని కోటగిరి, బాన్సువాడ, బీచ్కుంద కామారెడ్డి, లింగంపేట లలోని మైనారిటీ రెసిడెన్షియల్ విధ్యాలయాలలో మౌళిక వసతులు పెంచడానికి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామ‌ని మంత్రి వివ‌రించారు. బాన్సువాడలో మైనారిటీ బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కళాశాల ఉన్న నేప‌థ్యంలో, మైనారిటీ బాలికల కోసం ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని  కోరిన‌ట్లు మంత్రి పోచారం తెలిపారు.

కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ‌ మల్టీ సెక్టోరల్ డెవలప్ మెంట్ ప్రొగ్రాం క్రింద మైనారిటీ విద్యాసంస్థలలో మౌళిక వసతుల మెరుగుకు నిధుల్ని కేటాయించాల‌ని కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తుల‌పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించార‌ని, త్వ‌ర‌లోనే మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల‌కు నిధులు కేటాయిస్తామ‌ని హామి ఇచ్చార‌ని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వివ‌రించారు.

ఈ స‌మావేశం సంద‌ర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం మైనారిటీల విధ్య, అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు అభినంద‌నీయ‌మ‌ని కేంద్ర మంత్రి కితాబు ఇచ్చార‌ని మంత్రి తెలిపారు.  తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా ఆద‌ర్శంగా నిలుస్తున్నాయ‌న్న కేంద్ర మంత్రి, దేశంలోని అన్ని రాష్ట్రాలు మైనార్టీల విద్యాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌ల‌ను తీసుకురావాల్సి ఉంద‌ని తెలిపార‌ని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు మైనారిటీల కోసం కేవలం 6 రెసిడెన్షియల్ విద్యాసంస్థలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నూతనంగా 206 గురుకుల పాఠ‌శాల‌ల‌ను నెల‌కొల్పిన‌ట్లు మంత్రి వివ‌రించారు.

గురుకుల పాఠ‌శాల‌ల్లో తమ పిల్లలకు అందుతున్న విద్యా, మౌళిక‌ సౌకర్యాలు, భోజ‌న స‌దుపాయాల‌పై మైనారిటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి కలిపి నూతనంగా  మొత్తం 536 రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేశామ‌ని మంత్రి తెలిపారు. ఈ విద్యాలయాలలో విద్యార్థులకు మంచి విద్యతో పాటు, నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామ‌ని, దీంతో విద్యార్థుల్లో మాన‌సిక‌, శారీర‌క ఎదుగుద‌ల‌ను పెంపొందించ‌గ‌లుగుతున్నామ‌ని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వివ‌రించారు.

కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ ని రాష్ట్ర వ్య‌వసాయ‌, ఉద్యాన‌వ‌న శాఖ‌ల మంత్రి పోచారం శ్రీ‌నివాస రెడ్డి తో పాటు, జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు బిబి పాటిల్ క‌లిసారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *