Thursday , June 21 2018
Breaking News
Home / scroll / ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం… ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు

ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం… ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు

ఆర్ ఆండ్ బీ  స్థలాలనూ వదలట్లేదు

రూ.కోట్ల ఆస్తులపై అక్రమార్కుల కన్ను

యథేచ్ఛగా నిర్మాణాలు…. ఆపై నెల నెలా అద్దెల వసూళ్లు

ప్రభుత్వ స్థలంతో రియల్ వ్యాపారం

మామూళ్ళ మత్తులో R &B అధికారులు

మంగళగిరి న్యూస్ :
గూడు లేని నిరుపేద ప్రభుత్వ స్థలంలో కాస్తంత జాగాకు ఆశ పడ్డాడంటే అందులో అర్థముంది. అన్నీ ఉన్నవాడు ఆక్రమించుకున్నాడంటే వారిని ఏవిధంగా పరిగణించాలో అధికారులే చెప్పాలి. నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్నది సరిపోక ఇప్పుడు ఏకంగా R & B స్థలాల పై కూడా పడ్డారు కొందరు అక్రమార్కులు. ప్రభుత్వ నిబంధనలుంటే మాకేంటి అంటూ శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్నారు భూబకాసురులు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం లోని మంగళగిరి పట్టణం లో రూ.కోట్ల విలువైన R & B స్థలాలనే అక్రమార్కులు ఆక్రమిస్తున్నారు. స్థలం లో భారీ పంక్షన్ హాలు, చేపల చెరువుతో పాటు పలు గృహాలు సైతం నిర్మిoచారు. ఇక అంతటితో ఆగకుండా వాటిని క్రమబద్దీకరించుకునేందుకు పావులు కదుపుతున్నారు కొందరు కబ్జాదారులు. మరి కొందరు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి నెల నెలా అద్దెలకు ఇస్తున్నారు. ఇక మరి కొందరు కబ్జాదారులు మాత్రం స్థలం తమదేనంటూ అమాయకులకు లక్షల్లో విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆక్రమణ దారుల నుంచి లక్షల్లో నెల మామూళ్ళు వసూళ్లు చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

యథేచ్ఛగా ఆక్రమణలు

అధికారుల పర్యవేక్షణ కొరవడంతో అక్రమార్కుల కన్ను ఖాళీ ఆర్ అండ్ బీ స్థలాలపై పడింది. తొలుత తాత్కాలికo గా పూరి పాకలు … ఆ తరువాత రేకుల షెడ్లుగా వేసితమ అధీనంలోకి తీసుకున్న అక్రమార్కులు… ఫంక్షన్ హాలు, చేపల చెరువులనే నిర్మించారు. రోజు రోజుకూ అనేక స్థలాల్లో నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆర్ అండ్ బీ స్థలాల ఆలనాపాలనా పట్టించుకునే వారే లేకపోవడంతో రైల్వే లైను నుంచి ఆర్ అండ్ బీ రోడ్డు వరకు రూ.కోట్ల స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. పలువురు కబ్జారాయుళ్లు జంకుబొంకూ లేకండా స్థలాలను కొల్లగొట్టడం గమనార్హం. గతంలో ఇదే ప్రాంతం లోని ఓ కబ్జా దారుడు తన తల తానే రాయి పెట్టి పగుల గొట్టుకోవడం తో పాటు ఆర్ అండ్ బీ ఏ ఈ, సిబ్బంది దాడి చేశారని మంగళగిరి పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేయడo కొసమెరుపు. ఇక రూ.కోట్ల విలువైన మెయిన్‌రోడ్‌ సమీపంలోని ఆర్ అండ్ బీ స్థలాలను కబ్జాచేసిన ఆక్రమణదారులు కొందరు ఆ స్థలాలపై హక్కులు సాధించేందుకు ప్రయత్నించడం గమనార్హం. ఇందుకోసం కొందరు పైరవీకారులు సిండికేట్‌గా ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆర్ అండ్ బీ కి చెందిన స్థలాలను పరిరక్షించడంలో సoబoధిత అధికారులు విఫలమయ్యారన్నది ఈ ఆక్రమణలతో తేటతెల్లమవుతోంది. ఆర్ అండ్ బీ అధికారుల నిర్లక్ష్యo కారణం గా కబ్జారాయుళ్ల దందాలకు అంతేలేకుండాపోతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆర్ అండ్ బీ స్థలాల్లో ఆక్రమణలు తొలగించాలని పలువురు ప్రజలు కోరుతున్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *