Sunday , May 27 2018
Breaking News
Home / సినిమా / వెండితెరపై యుద్ధభేరి

వెండితెరపై యుద్ధభేరి

వెండితెరపై యుద్ధభేరి

జీవితం ఓ యుద్ధం…
అందులో సినిమా మహా యుద్ధం! బరిలో దిగాక విజయమో, వీర స్వర్గమో తేలిపోవాల్సిందే. చరిత్ర పుస్తకంలో మనం చదువుకున్న ప్రపంచ యుద్ధాలు రెండే! 2017 తెలుగు సినీ చరిత్రలో మాత్రం అవి మూడు.ఈ యేడాది భళ్లాలదేవునిపై బాహుబలి విశ్వరూపం చూశారు తెలుగు ప్రేక్షకులు. తొలి తెలుగు చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణ’ వీరత్వాన్ని మనసారా వీక్షించారు. ఈ రెండు యుద్ధాలూ నేలపై జరిగితే ‘ఘాజీ’ మాత్రం నీటిలో జరిగిన పోరాటాన్ని చూపించింది. మూడూ.. మూడే! దేని దౌడు దానిదే. 2017లో రోమాలు నిక్కబొడిచేలా సాగిన యుద్ధాలు… ఎలాంటి అనుభూతిని కలిగించాయంటే!
మన కథానాయకులు కత్తులు దూశారు… బాణాలు సంధించారు.‘నువ్వా నేనా’ అంటూ శత్రువుతో తలపడ్డారు. యుద్ధభూమిలో ప్రత్యర్థి రక్తం కళ్ల చూశారు.గుర్రపు డెక్కల చప్పుడు థియేటర్లని హోరెత్తించాయి. ఆ పోరాటంతో విజయధ్వానాలు మిన్నంటాయి… బాక్సాఫీసు దగ్గర విజయ ద్వారాలు తెరచుకున్నాయి! అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ‘బాహుబలి 2’ గురించే! వెండితెర యుద్ధమంటే ఏ హాలీవుడ్‌ సినిమానో గుర్తొచ్చేది. ‘ఆ స్థాయిలో యుద్ధ సన్నివేశాలు మనమూ తీయగలం’ అని నిరూపించాడు రాజమౌళి.

‘బాహుబలి’లో వార్‌ సీక్వెన్స్‌ చూసి ‘నభూతో.. నభవిష్యత్‌’ అనుకొని సంబరపడ్డారు తెలుగు సినీ అభిమానులు. ఆ ఉత్సాహాన్ని రెండింతలు చేస్తూ ‘బాహుబలి 2’ని డిజైన్‌ చేశాడు రాజమౌళి. ఇందులో ప్రతీ సన్నివేశమూ ఓ యుద్ధమే! ప్రభాస్‌ని పరిచయం చేసే దృశ్యమే ఓ మినీ వార్‌ సీక్వెన్స్‌లా ఉంటుంది. మదపుటేనుగుని వశం చేసుకొని – తొండాన్ని శివధనస్సుగా మలచుకుని బాణాన్ని సంధించే దృశ్యం కన్నుల పండుగలా కనిపించింది. దేశాటనకు కుంతల దేశం వెళ్లిన బాహుబలి… దేవసేనతో కలిసి చేసిన యుద్ధం మరో ప్రధాన ఆకర్షణ. ఒకేసారి మూడు బాణాల్ని సంధిస్తూ, అదే సమయంలో ఆ విద్యని దేవసేనకీ నేర్పిన సన్నివేశం అబ్బుర పరుస్తుంది. ఇక పతాక సన్నివేశాల్లో తెలుగు తెర అంతర్జాతీయ స్థాయిలో వెలిగింది. బాహుబలి – భళ్లాలదేవుని మధ్య సాగే అంతిమపోరు ఈ చిత్రాన్ని మరోస్థాయిలో నిలబెట్టింది. యుద్ధ సన్నివేశాలు లేని ‘బాహుబలి’ని వూహించలేం. వాటిని తనదైన శైలిలో ఆవిష్కరించిన రాజమౌళి ప్రతిభకు వీరతాళ్లు వేయకుండా ఉండలేం. దాదాపు రూ.40 కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కించిన ఈ యుద్ధ సన్నివేశాలన్నీ రామోజీ ఫిల్మ్‌సిటీలోనే చిత్రీకరించారు.

About Srinivas Kuncham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *