Sunday , December 16 2018
Breaking News
Home / scroll /   వడ్డెర్లను విస్మరిస్తున్న కేసీఆర్ సర్కార్ : ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దండి వెంకట్

  వడ్డెర్లను విస్మరిస్తున్న కేసీఆర్ సర్కార్ : ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దండి వెంకట్

  వడ్డెర్లను విస్మరిస్తున్న కేసీఆర్ సర్కార్ : ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దండి వెంకట్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లను విస్మరించడం అత్యంత శోచనీయమని ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ వడ్డెర జెఏసి రాష్ట్ర కన్వీనర్‌ దండి వెంకట్ విమర్శించారు ఈ రోజు బీంగల్ మండల కేంద్రంలోని వడ్డెర బస్తీ లో వడ్డెర సంఘం అర్మూర్ డివిజన్ నాయకులు నరేష్ అధ్యక్షతన జరిగిన వడ్డెర్ల సమావేశంలో దండి వెంకట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్డెర్ల ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి చర్యలు చెపట్టిన దాఖలాలు లేకపోవడం వడ్డెర్లపై టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షతకు నిదర్శనమన్నారు. జిల్లాలో MLA లు,MP నిధుల నుండి వడ్డెర కమ్యునిటీ భవనాల కోసం కేటాయించకపోవడంతోనే ప్రభుత్వ వివక్షత కనిపిస్తుందన్నారు. జిల్లాలో వేలాదిమంది వడ్డెర్లు ఉపాది లేక గల్ఫ్ దేశాలకు వలసపోయి అప్పులపాయనప్పటికి ప్రభుత్వం నుండి ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వడ్డెర్లకు అందివ్వడంలో ప్రభుత్వ అధికారులు వివక్షత చూపుతున్నరనడానికి జిల్లాలో డబుల్ బెడ్ రూం ల స్కీంలో వడ్డెర్లకు ప్రధాన్యతను ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిస్తుందన్నారు. రాబోయే కాలంలో వడ్డెర్లు ఇతర ఎంబిసి కులాలైన రజక, నాయబ్రాహ్మణ, గంగపుత్ర,విశ్వకర్మ, కుమ్మరి తదితర కులాలతో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీంగల్ మండల వడ్డెర సంఘం నాయకులు బత్తుల సంతోష్,వడ్డెర యువ సేన అర్మూర్ డివిజన్ అధ్యక్షులు సూర సురేష్, ఉపాధ్యక్షులు అలకుంటు నరేష్, వడ్డెర సంఘం అర్మూర్ డివిజన్ కార్యదర్శి వేముల అంజయ్య,పల్లపు చంద్రం,అలకుంట ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *