Sunday , October 21 2018
Breaking News
Home / scroll / అధికారులు బాధ్యత గుర్తించి పని చేయాలి – జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్ రావు

అధికారులు బాధ్యత గుర్తించి పని చేయాలి – జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్ రావు

అధికారులు బాధ్యత గుర్తించి పని చేయాలి జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్ రావు

నిజామాబాద్‌ః వివిధ శాఖలలో నిర్వహిస్తున్నవసతి గృహాల్లో పని చేస్తున్నహాస్టల్‌ వేల్పేర్‌ అధికారులు భాధ్యత గుర్తించి పని చేయాలనిలేని పక్షంలో ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహాన్‌ రావు అన్నారు. బుధవారం స్థానిక పాత అంబేడ్కర్‌ భవనంలో వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వసతి గృహాల్లో అవినీతి సహించేది లేదన్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు వెనకబడిన బడుగు, బలహీన వర్గాల వాళ్లు చదువుతారని, వారు ఇతర వర్గాలకు సమానంగా ఎదిగెందుకు తన వంతు బాద్యతగా పనిచేయాలన్నారు. అధికారులు స్వతహాగా ప్రేరణ పొంది ఎవ్వరి సంక్షేమానికైతే పథకాలు, నిధులు విడుదల చేస్తున్నారో వారికే చెందేలా చూడాలన్నారు. ప్రతి పనికి నిధులుంలాయని వాటిని దుర్వినియోగం చేయకుండ సక్రమంగా వినియోగిస్తే మంచి పలితాలు సాధించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, స్వచ్చత అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరు సమయస్పూర్తితో, సమన్వయంతో పని చేస్తే మంచి పలితాలు సాధించవచ్చనివివరించారు. ప్రభుత్వం నుండి నిధులు రాని పక్షంలో సంబంధిత అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని, అవసరమైతే కలెక్టర్‌ నిధుల నుండి అవసరాన్నిబట్టి మంజూరు చేస్తామన్నారు. 10వ తరగతిలో వందశాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అన్నారు. వసతి గృహాల్లో తరచుగా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌జివోస్‌ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్‌, బిసి, యస్‌టి సంక్షేమశాఖ అధికారులు విమలకుమారి, సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖాధికారి రాజేష్‌, డియంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *