Monday , February 19 2018
Breaking News
Home / scroll / భయపెడుతున్న పట్టణ సింహాలు..!

భయపెడుతున్న పట్టణ సింహాలు..!

  కుక్కలు వస్తున్నాయి…..
జబ్బలు జాగ్రత్త…..
భయపెడుతున్న పట్టణ సింహాలు..!

మంగళగిరి న్యూస్ :  మంగళగిరి పురపాలక సంఘ పరిధిలోని ఆయా వార్డుల్లో కుక్కలబెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల కాలంలో మంగళగిరి పట్టణం తోపాటు రూరల్ గ్రామాల్లో సైతం కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పగలూ రాత్రీ అనే తేడాలేకుండా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి.
కుక్కల నిర్మూలన కు పురపాలక సంఘ అధికారులు గతం లో కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకున్నా కేవలం దస్థ్రాలకే పరిమితమైoది. ఎన్ని కుక్కలకు కు. ని . ఆపరేషన్లు చేశారో ఆ పై వాడికే తెలియాలి. ఇక ఇటీవల నుంచి మళ్ళీ కుక్కల సంఖ్య పెరిగిపోతోంది. పట్టణం లోని 13 వ వార్డు ఇస్లాంపేట లో వీటి దాడి భారిన పడి స్థానిక ప్రజలు గాయపడుతున్నారు. ఇటీవల ఇద్దరు చిన్నారుల పై వీధి కుక్కలు దాడి చేయడంతో వారు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు. మంగళగిరి పట్టణం లో దాదాపు అయిదారు వేలకుపైగా కుక్కలు ఉన్నాయి. నెలకు వందలాది మంది ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నప్పటికీ మున్సిపల్ అధికారులు కుక్కల నిర్మూలనపై దృష్టిసారించడంలేదని పలువురు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణం లో ఏ వీధికి వెశ్లినా గుంపులు గుంపులుగా కుక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రతి సెంటర్లోనూ రౌడీల మాదిరిగా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడంలేదు. రాత్రి సమయాల్లో వీధుల్లో తిరగాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కుక్కల నివారణపై మున్సిపల్ పాలకులు, అధికారులు మరో మారు దృష్టిసారించాల్సి ఉంది.

About Srinivas Kuncham

Check Also

హన్స్ రాజ్ గంగారాం ను కలిసి వినతిపత్రం సమర్పించిన అరవింద్

కేంద్ర మంత్రి  హన్స్ రాజ్ గంగారాం  హైదరాబాద్ వచ్చిన సందర్బంగా రాష్ట్రా కార్య వర్గ సభ్యులు ధర్మపురి అరవింద్   కలిసి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *