Wednesday , August 21 2019
Home / scroll / దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ

దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ

దుబాయ్: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లే వలసదారులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన జారీ చేసింది. కొత్తగా వీసాలు పొందే వలసదారులు తప్పకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని దుబాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా వీసా పొంది తమ దేశంలో అడుగుపెట్టే వలసదారులు తప్పకుండా వారి దేశంలో స్థానిక పోలీసుల దగ్గర సత్ప్రవర్తన సర్టిఫికెట్ రాయించుకుని రావాలని తెలిపింది. ప్రపంచంలోనే తమ దేశం ఎంతో సురక్షితమైనదని దుబాయ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అసాంఘిక శక్తులు దేశంలో అడుగుపెట్టకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది.అలాగే ఇప్పటికే దుబాయ్‌లో ఉంటున్న వలసదారులు సత్ప్రవర్తన సర్టిఫికెట్‌లు సమర్పించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అలాగే టూరిస్టు వీసాలపై వచ్చే వారికి కూడా ఈ నిబంధన వర్తించిందన్నారు. దుబాయ్ విదేశాంగ శాఖ వలసదారులు సమర్పించే సర్టిఫికెట్‌ను ధ్రువపరుస్తుందని అప్పుడే వలసదారుడికి వీసా మంజూరు అవుతుందని అధికారులు తెలిపారు. ఒకవేళ అది తప్పు సర్టిఫికెట్ అని తేలితే వెంటనే అతడిని దేశం నుంచి పంపించి వేస్తామని అధికారులు చెప్పారు. అయితే ఈ నిబంధన ఫిబ్రవరి 4 నుంచే అమలోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

About Srinivas Kuncham

Check Also

జాతీయ జెండా,భారత మాత చిత్ర పటాలకు అవమానం

కామారెడ్డి, ఆగష్టు16 ( ప్రజా జాగృతి) ః 73వ స్వతంత్ర్య దినోత్సవం సందర్బంగా వివిధ రాజకీయ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *