జర్నలిస్ట్ డైరీ ఆవిష్కరణ
సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరిని మంగళవారం నాడు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. జిల్లాలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు,నేరాలను అదపుచేయడంలో పత్రిక ప్రతినిధులు వార్త ప్రచురణలు చేసి తమకు సహకరించడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు యం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి యండి నజీర్ అహ్మద్, కోశాధికారి టి.డేవిడ్ రాజ్,మధు సుదన్ చారి,మల్లారెడ్డి,కృష్ణ,నరహరి, నసిర్,సంతోష్,విజయ్ కుమార్ ,విఠల్ రెడ్డి,సంతోష్ రెడ్డి, ఏఆర్. డి.ఎస్.పి సంజీవ్, ఏఆర్. ఇన్స్పెక్టర్ హరిలాల్, పి.ఆర్.ఓ లక్ష్మీ కాంత్,తదితరులు పాల్గొన్నారు.