Saturday , April 21 2018
Breaking News
Home / scroll /  దుర్గగుడి ఈవోగా పద్మ … ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం…

 దుర్గగుడి ఈవోగా పద్మ … ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం…

 దుర్గగుడి ఈవోగా పద్మ
* ఉత్త‌ర్వులు జారీచేసిన ప్ర‌భుత్వం

ఇంద్ర‌కీలాద్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీచేసింది. బ‌దిలీల్లో భాగంగా విజ‌య‌వాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవోగా ఐఏఎస్‌ అధికారిణి ఎం.పద్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దుర్గగుడిలో అర్ధరాత్రి పూజలు జరిగాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పటి ఈవోగా ఉన్న ఎ.సూర్యకుమారిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలను దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనూరాధకు తాత్కాలికంగా అప్పగించారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం మొత్తం నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసిన నేపథ్యంలో దుర్గగుడికి పూర్తిస్థాయి ఈవోగా పద్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే ఆమెకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల‌ను కూడా అప్పగించారు. కార్మిక ఉపాధి శిక్షణ ప్రత్యేక కార్యదర్శిగా నీరబ్‌కుమార్‌, పశు సంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ ముఖ్య కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిలను నియమించారు. మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి రిపోర్టు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *