Sunday , August 19 2018
Breaking News
Home / scroll /  రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ : ఐటి మంత్రి నారా లోకేష్

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ : ఐటి మంత్రి నారా లోకేష్

 రాయలసీమ ఇక పారిశ్రామిక సీమ
ఐటి మంత్రి నారా లోకేష్

‘ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘ బిజినెస్ సెషన్‌లో ఆకట్టుకున్న లోకేష్ ప్రసంగం

దావోస్, జనవరి 23:

దశాబ్దాలుగా నీరులేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవనరులతో కళకళలాడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో దక్షిన కొరియా కంపెనీ కియా మోటార్స్ తన కార్ల ఫ్యాక్టరీని అనంతపురం లో నెలకొల్పడమే ఇందుకు నిదర్శనమని లోకేష్ అన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు మునుపున్నడూ లేనంతగా నీరు తెచ్చిందని వివరించారు. అందువల్లనే అనంతపురము జిల్లా నేడు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి ముఖ్య కేంద్రంగా రూపుదిద్దుకొటోందని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం దశాబ్దాలుగా ఒక కలగా మిగిలిందని, గోదావరి-కృష్ణా అనుసంధానం ద్వారా తాము చేసి చూపించామని లోకేష్ చెప్పారు. సమీప భవిష్యత్తులో మరిన్ని నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
మంగళవారం సి.ఐ.ఐ, పిడబ్ల్యుసి సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఇండియా‘ వ్యాపార విభాగ (బిజినెస్ సెషన్)‌లో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ రెండు పారిశ్రామిక నడవలు (industrial coridars) ఒక వరమని, వైజాగ్ -చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై -బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లని వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి కోసం వినియోగించుకుంటున్నామని లోకేశ్ వివరించారు. అనంతపురం జిల్లాలో జల వనరుల అభివృద్ధికి ప్రధమ ప్రాధాన్యతనిచ్చామని, అందుకే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కియా మోటార్స్ సంస్థ ఈ జిల్లాలో కార్ల కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని అన్నారు. వివిధ ప్రాంతాల్లో వనరులు, మౌలిక సదుపాయాల లభ్యతను అనుసరించి క్లస్టర్ల వారీగా పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు లోకేశ్ వివరించారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్స్, సోలార్ క్లస్టర్లను ఉదహరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అనువైన పరిస్థితులు సృష్టించడానికి ఉత్పాదక క్లస్టర్లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఇప్పటికే సెల్కాన్,డిక్సన్, కార్బన్ లాంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి గుర్తు చేశారు.
శ్రీసిటీ సెజ్‌లో ఒకే చోట మహిళలకు 12 వేల ఉద్యోగాలు
శ్రీ సిటీ సెజ్ లో ఫాక్స్‌కాన్ మొబైల్ తయారీ కంపెనీ లో ఒకే చోట 12 వేల మంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్యాటరీ తయారీ నుంచి పూర్తి స్థాయి మొబైల్ తయారీ వరకూ ఉన్న అన్ని విడి భాగాల తయారీ కంపనీలతో క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకుని దేశచరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 35వేల ఎకరాల భూమిని సమీకరణ పద్ధతిలో తీసుకున్నామని, రాజధాని అమరావతి నిర్మాణంలో వారిని భాగస్వాములను చేశామని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతున్నామని, హరిత, ఆహ్లాదభరిత వాతావరణం ఉట్టిపడేలా ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్నామని, ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో ఎంతో విశ్వాసంతో రైతులు స్వచ్ఛందంగా సమీకరణకింద భూమిని ఇచ్చారని అన్నారు. ఇందువల్ల భూముల విలువ పెరిగింది. అదనంగా పెరిగిన విలువలో ఎక్కువ భాగం రైతాంగానికే దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భూమిని అభివృద్ధి చేసి రైతాంగానికి వాటా ఇచ్చిందని, జోడించిన అదనపు విలువలో వారే మొదటి లబ్దిదార్లుగా ఉంటారని తెలిపారు. కాగా సమావేశంలో తొలుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడారు. ప్యానల్ చర్చలో మంత్రి లోకేశ్ సహా, నీటి ఆయోగ్ ప్రతినిధి అమితాబ్ కాంత్, అపోలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభన కామినేని, సి.ఐ.ఐ డైరెక్టర్ జనరల్ సీఐఐ ప్రతినిధి చంద్రజిత్ బెనర్జీ, పిడబ్ల్యుసికి చెందిన మనీశ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *