Sunday , December 16 2018
Breaking News
Home / scroll / తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ :మంత్ర దేవినేని ఉమా

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ :మంత్ర దేవినేని ఉమా

తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలకు ప్రాధాన్యత – మైలవరంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ

జిల్లాలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా త్వరలో లక్ష ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం

మండలంలో మూడు విడతల్లో పట్టాలు పంపిణీ చేస్తా

మంత్ర దేవినేని ఉమా

మైలవరం:-

తెలిసిగానీ తెలియకగానీ ఒక్క నయాపైసా కూడా ఎవ్వరికీ ఇవ్వద్దని ఇళ్ళ పట్టాలను నేనే తీసుకొచ్చి మీ పట్టా మీకు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంగళవారం నాడు మైలవరం మండల పరిషత్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ఉమా ప్రారంబించారు. మైలవరంలో 520, చంద్రాల 10 చంద్రగూడెం 48, మొరసుమిల్లి 22, దాసుల్లపాలెం 28, జంగాలపల్లి 32, పుల్లూరు 11, గణపవరం 36, కనిమెర్ల 4, ఎదురుబీడెం 10, కీర్తిరాయనిగూడెం 15 మొత్తం 801 పట్టాలను లబ్దిదారులకు మంత్రి స్వయంగా అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రెండు విడతల్లో వెల్వడం, పొందుగల గ్రామాల్లో మరియు మైలవరం టౌన్ లో 371 పట్టాల పంపిణీ చేపడతామని తెలిపారు. ఇందుకోసం ఎవరికి ఒక్క నయాపైసా కూడా ఇవ్వద్దని, ఎవరైనా తప్పు చేస్తే మీ చేతిలో ఆయుధం ఉందని అది 1100 అని దానికి ఫిర్యాదు చేస్తే మీ వద్ద దళారులు తీసుకున్న డబ్బులు తిరిగి ముఖ్యమంత్రి గరే మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తారని అన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో ఎక్కడ మొదలు కాలేదని మొట్టమొదటి సారిగా మైలవరంలోనే అది జరుగుతుందని తెలిపారు. రాబోయే రెండు నెలల్లో నెలల్లో లక్ష పట్టాలు ముఖ్యమంత్రి గారి చేతులమీదుగా ఇవ్వబోతున్నామని పెండింగులో ఉన్న అన్నింటిని మంత్రిమండలి సమావేశంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిష్పక్షపాతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ పట్టాలు అందజేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు

 

** మైలవరం టౌన్ లో రూ. 35 లక్షలతో సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు వ్యవసాయ అధికారి నూతన భవనాలకు మరియు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రూ.15.50 లక్షలతో నిర్మించే రెండు అదనపు తరగతి గదులకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం నాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు

About Srinivas Kuncham

Check Also

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన

బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం నిజామాబాద్‌ లో పర్యటన నిజామాబాద్‌ జిల్లాలో బ్రిటీష్ దౌత్యవేత్తల బృందం బుధవారం, గురువారం పర్యటించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *