Saturday , April 20 2019
Breaking News
Home / scroll / పదవి వారిది.. పెత్తనం వీరిది…- కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఇళ్లకే పరిమితం

పదవి వారిది.. పెత్తనం వీరిది…- కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఇళ్లకే పరిమితం

పదవి వారిది.. పెత్తనం వీరిది
– కొంతమంది మహిళా కౌన్సిలర్లు ఇళ్లకే పరిమితం
-తప్పనిసరి అయితేనే సమావేశాలు
– సమీక్షల్లో భర్తల హవా
అధికారిక కార్యక్రమాల్లో సైతం అదే తీరు

 

మంగళగిరి  :
‘ఆకాశంలో సగం.. అన్నింటా సగం…’ రిజర్వేషన్లపై మహిళల రణనినాదమిది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు.. చట్ట సభల్లోనూ 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని పోరాటాలు చేశారు. తీరా రిజర్వేషన్‌ కల్పిస్తే పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేదు. కొంతమంది భర్త చాటు భార్యలుగానే మిగిలిపోతు న్నారు. ఒక్క విషయంలోనూ స్వతంత్రంగా వ్యవహరిం చడం లేదు. కొందరు తప్పనిసరైతే తప్ప ఇంటి గడప దాటడం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. 32 వార్డుల్లో 16 స్థానాలు మహిళలకు కేటాయించారు. అయితే మహిళా రిజర్వేషన్ చెప్పుకు నేందుకు మాత్రమే అన్న చందాన తయారైంది. పేరుకే వారు కౌన్సిలర్లు…. పెత్తన మంతా భర్తలదే. ఐతే ఒకరిద్దరు కౌన్సిలర్లు ఇందుకు మిన హాయింపు.

సమావేశాల్లో సైతం భర్తలదే హవా..!

మున్సిపల్ పరిధి లోని ఆయా వార్డు కౌన్సిలర్ భర్తలు తరచూ అధికారులతో సమావేశం అవుతుంటారు. అయితే ఆ సమయం లో మహిళా కౌన్సిలర్లు మాత్రం హాజరుకారు. ఓ కౌన్సిలర్ భర్త.. ఏకoగా అన్నీ తానై వ్యవహారాలు చక్కబెడుతూ అధికారిక కార్యక్రమాల్లో సైతం హడావిడి చేస్తుంటాడు. ఇక మరో కౌన్సిలర్ భర్త.. అధికారులను తరచూ బెదిరిస్తుంటాడు. సాధారణ విషయాన్ని కూడాదురుసుగా చెప్పడం అతని ప్రత్యేకత. ఇక ఓ కౌన్సిలర్ కుటుంబ సభ్యులదే పెత్తనం. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు వచ్చినా వారిని కలవాల్సిందే. ఓ మహిళా కౌన్సిలర్ కు అధికారులు, ప్రజలతో మాట్లాడే సామర్ధ్యం ఉన్నా…. ఆమె భర్త ఎప్పుడూ పక్కనే ఉంటారు. ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేత అన్నీ చూసుకుంటారు. ఆ మహిళా కౌన్సిలర్ తప్పనిసరైతే తప్ప బయటకు రారు. కొందరు అధికార పార్టీ కౌన్సిలర్ల భర్తలదీ అదే తీరు. ఇటీవల ఓ కౌన్సిలర్ భర్త పనులు చేయించే క్రమంలో అధికారు లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశ మైంది. ఏ హోదాతో ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు..? ఇంత దురుసుగా వ్యవహరిస్తే పనిచేయడం కష్టమని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసేoదుకు సిద్ధం కాగా ఎందుకో మళ్ళీ వెనక్కు తగ్గారు.

మహిళా కౌన్సిలర్ల వెంట అధికారిక కార్యక్రమాల్లో భర్తలు కనిపించొద్దని గతంలో పురపాలక శాఖ అధికారులు ఆదేశించినా వారిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. వార్డుల్లో జరిగే కార్యక్రమాల్లో పాటు కౌన్సిల్‌ సమావేశాల సమయంలోనూ మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నారు. ఓ కౌన్సిలర్ భర్త మున్సిపల్ కార్యాలయంలో జరిగే సర్వసభ్య/ప్రత్యేక సమావేశాలకు సతీమణిని దగ్గరుండి మరీ తీసుకు వస్తుంటాడు. మేడమ్‌ హాల్‌లోకి వెళ్లిన తరువాత అక్కడక్కడే తిరుగుతుంటాడు. కొందరు వెనుకనే వున్న సీట్లలో కూర్చుంటున్నారు. ఏదైనా సమస్యపై అధికారులకు వినతిపత్రం ఇవ్వాలనుకుంటే కౌన్సిలర్ తో సహా వెళ్లి ఫొటోలకు ఫోజులిస్తారు. మంగళవారం కౌన్సిల్ హాల్లో హౌసింగ్ అధికారుల తో జరిగిన సమావేశానికి ఇద్దరు మహిళా కౌన్సిలర్ల భర్తలు హాజరై ఏకoగా కౌన్సిలర్ల సీట్లలో కూర్చోవడం విశేషం.

ఒకరిద్దరు బెటర్‌…

ఒకరిద్దరు మహిళా కౌన్సిలర్లు తమదైన శైలిలో రాణిస్తున్నారు. అధికారులు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. కౌన్సిల్‌ సమావేశాల్లో కూడా వారు అధికారుల తప్పులు ఎత్తి చూపుతూ.. ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా స్పష్టంగా మాట్లాడు తున్నారు. అంతకుముందు పాలకమండలితో పోలిస్తే ప్రస్తుతం కొందరు మహిళా కౌన్సిలర్లు ఉన్నత విద్యా వంతులు. కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు మాత్రం భర్త చాటు భార్యలుగానే ఉంటున్నారు. భర్త రాసిచ్చే స్ర్కిప్టును కౌన్సిల్‌లో చదవడం వరకే వీరి విధి. అంతకు మించి చర్చించేందుకు సాహసించరు. 16 మంది కౌన్సిలర్లు ఉన్నప్పటికీ.. వారిలో పౌర సమస్యలపై ఇప్పటి వరకు మాట్లాడింది కేవలం సగం మంది మాత్ర మేనని రికార్డులు చెబుతున్నాయి. ఏది ఏమైనా మున్సిపల్ పరిధిలో మహిళా కౌన్సిలర్ల భర్తల పెత్తనంకు అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది.

About Srinivas Kuncham

Check Also

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం*

*నీటి కోసం తలాడిల్లుతున్న లక్కారం, పట్టించుకోని పాలకవర్గం* ఏప్రిల్ 16 (ప్రజా జాగృతి) : లక్కారం గ్రామం లో గత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *