Thursday , June 21 2018
Breaking News
Home / scroll / 2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుంది : పవన్ కల్యాణ్

2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుంది : పవన్ కల్యాణ్

2019లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుంది : పవన్ కల్యాణ్

2019 ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని… ఆ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన బోణీ కొడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తనకు డబ్బు అవసరం లేదని, మీరిచ్చే ప్రేమ ముందు లక్షల కోట్లు కూడా పనికిరావని  అన్నారు. కరీంనగర్ లోని శుభంగార్డెన్స్ లో జనసేన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. ఆంధ్ర, తెలంగాణలు వేరైనా అందరం ఒకటే అని ఆయన అన్నారు. ప్రాంతీయ విభేదాలు సమాజానికి మంచిది కాదని చెప్పారు.   కుల, మత, ప్రాంతీయతత్వాలు లేని పార్టీ జనసేన అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయ సాధనకు కృషి చేస్తానని తెలిపారు. ఒక్కసారి మాట ఇస్తే మడమతిప్పే వ్యక్తిని కాదని చెప్పారు. 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి జనసైనికులంగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అంటే తనకు ఎంతో ప్రేమ అని చెప్పారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కాదు అని స్పష్టం చేశారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *