Friday , January 19 2018
Breaking News
Home / scroll / ఇంటింటికి తెలుగుదేశం పార్టీ

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ :

పెద్దపంజాణి మండలంలోని చామనేరు, అప్పినపల్లె, పెద్ద వెలగటూరు పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పరిశ్రమల శాఖా మంత్రివర్యులు అమరనాథ రెడ్డి గారు సోమవారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. అందులో భాగంగా కుంబార్లపల్లెలో రూ.7లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అప్పినపల్లెలో రూ.10లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, చినపరెడ్డిపల్లెలో రూ.9లక్షలతో సిసి రోడ్డును ప్రారంభిచారు. పంచాయతీ కేంద్రాలలో భహిరంగ సభలలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, జరిగిన, జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. అప్పినపల్లె గ్రామంలో ముత్తరాయప్ప గారి రామక్రిష్ణ ఆధ్వర్యంలో ఎం. శ్రీనివాసులు,రెడ్డెప్ప, జి.శ్రీనివాసులు,జయరాం,రెడ్డెప్పరెడ్డితో పాటు మరో 30 మంది వారి అనుచరులు మంత్రి ఆధ్వర్యంలో తెదెపాలో చేరారు. అదేవిధంగా చినపరెడ్డిపల్లెకు చెందిన జి.వెంకట్రమణ,ఈ.వెంకట్రమణ తదితరులు పార్టీ తీర్దం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపిపి మురళీ, జెడ్పీటీసి సులోచన, మండల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

సారయ్య భార్యకు 18000/- ఆసరా …:తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్

ఉప్పల్ నియోజకవర్గం: మీర్ పెట్ డివిజన్ నవోదయ కాలనీకి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సారయ్య 5 స౦. క్రితం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *