Sunday , August 19 2018
Breaking News
Home / scroll / సారయ్య భార్యకు 18000/- ఆసరా …:తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్

సారయ్య భార్యకు 18000/- ఆసరా …:తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్

ఉప్పల్ నియోజకవర్గం:

మీర్ పెట్ డివిజన్ నవోదయ కాలనీకి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సారయ్య 5 స౦. క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, వారి కుటుంభం ఆర్థికంగా దీనమైన స్థితిలో ఉందని గుర్తించిన ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరసా రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్  వారికి  ఆసరా కల్పించాలని, తన నెల జీతం ద్వారా వచ్చే డబ్బు నుండి కొంత మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని అనుకున్నారు.

ఈ విషయం ప్రకటించగానే తాడూరికి మద్దతుగా నిలిచిన కార్పొరేటర్ గొల్లురి అంజయ్య, డివిజన్ అధ్యక్షులు వంజరి ప్రవీణ్, స్థానిక నాయకులు బోధస్సు రవి తదితరులు కలిసి రూపాయలు 18000/- ను వారి సారయ్య భార్యకు అందించారు.

తాడూరి మాట్లాడుతూ ఉద్యమ కాలంలో చురుకుగా పాల్గొని రోడ్డు ప్రమాదం లో సారయ్య ప్రాణాలు కోల్పోయారు, నలుగురు పిల్లలతో తన భార్య అనేక కష్టాలు పడుతూ కాలాన్ని గడుపుతున్నదని, వారికి మా వంతు సహాయం అందించాలని అనుకున్నామన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి కే.సి.ఆర్ గారి పాలనలో ఇటువంటి అనేక పథకాలు ఎన్నో కుటుంబాలను ఆదుకుంటున్నాయని తెలిపారు. మేము కూడా కె.సి.ఆర్ గారి నుండి నేర్చుకున్నామని తెలిపారు, కె.సి.ఆర్ గారు కార్యకర్తలను మరువరని చెప్పారు.

వితంతువులకు కూడా 1000 రూపాయల పెంక్షన్ ఇస్తూ ఆసరాగా నిలిచారు అని అన్నారు తాడూరి.

వీరి పిల్లలను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలో చేర్పించి వారి ఉన్నత విద్యకు సహకరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెరసా నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *