Friday , January 19 2018
Breaking News
Home / scroll / తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

 

హైదరాబాద్ 16:

ఉమ్మడి ఆదిలాబాద్‌లో చోటుచేసుకున్న ఆదివాసీలు, లంబాడీల ఘర్షణను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం సరైన రీతిలో స్పందించలేదని భావించిన సర్కార్.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎస్పీ, కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌లను బదిలీ చేశారు. వీరి స్థానంలో కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌ పాటిల్‌ను, ఎస్పీగా కమలేశ్వర్‌ను నియమించింది. ఆదిలాబాద్ కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాష్‌ను బదిలీచేసింది. కరీంనగర్ రేంజ్ డీఐజీ రవివర్మ, ఆదిలాబాద్ ఎస్పీ శ్రీనివాసులును డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరి స్థానంలో.. కరీంనగర్ రేంజ్ డీఐజీగా ప్రమోద్ కుమార్‌, ఆదిలాబాద్ ఎస్పీగా విష్ణువారియర్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా దివ్య, నిర్మల్ కలెక్టర్‌గా ఎం. ప్రశాంతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు వరంగల్ అర్బన్‌ కలెక్టర్‌గా ఉన్న ఆమ్రపాలిని వరంగల్ రూరల్‌కు బదిలీచేశారు. వికారాబాద్ కలెక్టర్‌గా ఎం. రఘునందన్‌రావు, నాగర్‌కర్నూలు ఎస్పీగా సన్‌ప్రీత్‌సింగ్ నియామకంఅయ్యారు

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *