Friday , January 19 2018
Breaking News
Home / scroll / ప్రపంచ తెలుగు మహాసభ కోసం…

ప్రపంచ తెలుగు మహాసభ కోసం…

ప్రపంచ తెలుగు మహాసభలకు తరలివెళ్లున్న కవులు, రచయితలు, సాహితీ వేత్తలు…

డిసెంబర్ 15,
కామారెడ్ఢి.

హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు తరలుతున్న తెలుగు బాషా పండితులు, కవులు, భాషాభిమానులతో కూడిన బస్సులను జిల్లా కేంద్రంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి తెలుగు భాషాబిమాని అని అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు అధ్బుతంగా ఏర్పాట్లు చేసిందని, మన మాతృభాష తెలుగుకు ఇస్తున్న గౌరవం ఇది అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా పండితులను మహాసభలకు ఆహ్వానించామని ఈ సభకు 42 దేశాల నుండి తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులు పాల్గొంటున్నారన్నారు.తెలుగు మహాసభలను ఇంత భారి ఎత్తున ఘనంగా నిర్వహించడం ఇదే మొదటిసారని తెలంగాణ ప్రత్యేకత అనేది నేడు అందరికి అర్ధమయితుందని అన్నారు. మాతృభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమమని మంత్రి పోచారం అన్నారు.

About Srinivas Kuncham

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం: నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం 

తిరుమల తిరుపతి దేవస్థానం: ◆ సకాలంలో సర్వదర్శనం ◆నేటి ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన కొత్త విధానం ◆ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *